Share News

అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:13 PM

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహిరించి, అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిం చాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ నరేంద్‌ రాథోడ్‌ అన్నారు. దండేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు.

అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలి
దండేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డులను తనిఖీ చేస్తున్న డిఎంహెచ్‌వో డా. రాథొడ్‌ నరేంద్‌

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ నరేంద్‌ రాథొడ్‌

దండేపల్లి జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహిరించి, అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిం చాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ నరేంద్‌ రాథోడ్‌ అన్నారు. దండేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి లో వైద్య సేవలు, ముందుల స్టాక్‌ నిల్వను నేరుగా పరిశీలించారు. ఔషదీ పో ర్టల్‌లో నమోదు చేసిన మందుల వివరాలు స్టాక్‌ రిజిస్టర్లో నమోదు చేసిన మందుల వివరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ప్రతిరోజు అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చే రోగుకుల వైద్య సేవలు అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, వైద్యులు, సిబ్బంది అందరు సమయపాలన పాటించాలన్నారు. గ్రామాల్లో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసిన సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగామన కల్పించాలన్నారు. కుక్కకాటు, పాముకాటు వ్యాక్సినేష్లను అందుబాటులో ఉం చుకోవాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించి,వారికి మందులు అందజేయా లన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత లేకుండా వైద్యాధికా రులు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ లక్ష్మి, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:13 PM