Share News

రోడ్డున పడ్డారు..

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:14 AM

జిల్లా కేం ద్రంలోని మంచిర్యాల సిమెంట్‌ కంపెనీ (ఎంసీసీ) యాజమాన్యం అందులో పని చేసిన కార్మికుల ఉసురు పోసుకుంటోంది. నష్టాల పేరుతో నిబంధనలకు విరు ద్దంగా కంపెనీని మూసివేయడమే గాకుండా కార్మికుల సంక్షేమాన్ని యాజమాన్యం గాలికొదిలింది.

రోడ్డున పడ్డారు..

-నష్టాల పేరుతో సిమెంట్‌ కంపెనీ మూసివేత

-వేతన బకాయిలు, కార్మికుల బాగోగులు పట్టని యాజమాన్యం

-కోర్టులో కేసు ఉండగానే ఈ వేలం దిశగా యత్నాలు

వారం రోజులుగా మూకుమ్మడిగా ధర్నా చేస్తున్న కార్మికులు

మంచిర్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని మంచిర్యాల సిమెంట్‌ కంపెనీ (ఎంసీసీ) యాజమాన్యం అందులో పని చేసిన కార్మికుల ఉసురు పోసుకుంటోంది. నష్టాల పేరుతో నిబంధనలకు విరు ద్దంగా కంపెనీని మూసివేయడమే గాకుండా కార్మికుల సంక్షేమాన్ని యాజమాన్యం గాలికొదిలింది. వేతన బ కాయిలు కూడా చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడు తోంది. కంపెనీ ఆధీనంలో ఉన్న భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఫ్యాక్టరీని విచ్చిన్నం చేసి వాటిని విక్రయించడం ద్వారా ఒకేసారి వందల కోట్లు గడించే ఆలోచనతో యాజమాన్యం కార్మిక చట్టాలకు వ్యతిరేకం గా వ్యవహరిస్తుండటంతో నాలుగైదేళ్లుగా కార్మికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

ఇదీ కంపెనీ నేపథ్యం...

ది అసోసియేటెడ్‌ సిమెంట్‌ కంపెనీ (ఏసీసీ) లిమిటెడ్‌ 1957లో మొదటి సారిగా మంచిర్యాల పట్టణంలో తమ శాఖను ప్రారంభించింది. ఆ సమయంలో యాజమాన్యం 200 ఎకరాలను కొనుగోలు చేసి కంపెనీని స్థాపించింది. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం మరో 238 ఎకరా లను భూ సేకరణ చట్టం కింద సేకరించి ప్లాంటు యాజమాన్యానికి అప్పగించింది. కంపెనీని స్థాపించిన సమయంలో యాజమాన్యం 1200 మంది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి జవనోపాధికి బాట వేసిం ది. కార్మికుల సంక్షేమంలో భాగంగా అన్ని సౌకర్యాలతో కూడిన 251 క్వార్టర్లు, ఆసుపత్రి, పాఠశాల, తదితర వసతులు కల్పించింది. కంపెనీ లాభాల బాటలో పయనిస్తుండటంతో భవిష్యత్‌ అవసరాల కోసం వివిధ ప్రాంతాల్లో సుమారు 450 ఎకరాల భూములను కూడబెట్టింది. అనంతరం జరిగిన కొన్ని ప్రతికూల పరిస్థితు ల కారణంగా 2004లో యాజమాన్యం ప్లాంటును అ మ్మకానికి పెట్టింది. రూ. 33 కోట్లు వెచ్చించి కంపెనీని సేల్‌ డీడ్‌ ద్వారా కొనుగోలు చేసిన స్థానిక పారిశ్రామిక వేత్తలు భాగస్వామ్య పద్ధతిలో మంచిర్యాల సిమెంట్‌ కంపెనీ (ఎంసీసీ)గా నామకరణం చేశారు. 2004లో 438 మంది కార్మికులు ఉండగా నూతన యాజమా న్యం బాధ్యతలు స్వీకరించిన అనంతరం వలంటరీ రి టైర్మెంట్‌ ప్రకటించి 200 మంది కార్మికులను స్వచ్చంద పదవీ విరమణ కింద తొలగించింది. మిగిలిన 238 మందితో ఉత్పత్తి ప్రారంభించగా మంచి డిమాండ్‌ ఉండటంతో కొంతకాలం పాటు లాభాల బాటలో పయనించింది.

కంపెనీ విచ్చిన్నానికి కుట్ర...

యాజమాన్యం అంతర్గత ఒప్పందం ప్రకారం నిర్వహణ బాధ్యతలను 2007లో మరో భాగస్వామికి అప్ప గించింది. అనంతరం ఆ భాగస్వామి కంపెనీని సొం తం చేసుకునేందుకు మిగతా పార్టనర్లకు సెటిల్‌మెం ట్లు చేసి వారిని బయటకు సాగనంపారు. ఆ సమ యంలో మంచిర్యాలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విపరీతంగా పుంజుకోవడం, భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో నూతన యాజమాన్యం కంపెనీ విచ్చిన్నానికి ప్రణాళికలు రచించింది. కంపెనీ ఆధీనం లో భూముల విలువ సుమారు రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు వేసిన యాజమాన్యం వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించి ఉద్దేశ్యపూర్వ కం గా ఉత్పత్తిని తగ్గించడం, నష్టాల పేరుతో కార్మికులను వదిలించుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్ర మంలోనే కోవిడ్‌ సమయంలో సెటిల్‌మెంట్ల పేరుతో 20 మంది కార్మికులను తొలగించింది. ఇక కంపెనీలో 95 మంది పర్మినెంట్‌ కార్మికులు ఉండగా వారిని కూడా దశల వారీగా సాగనంపింది. చివరిగా 53 మంది కార్మి కులు మిగలగా 2020లో కంపెనీని అర్థాంతరంగా మూ సివేయడంతో కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.

పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలు....

కంపెనీ యాజమాన్యం మారినప్పటి నుంచి విద్యుత్‌ బిల్లులు బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపో యాయి. 2008 నుంచి ఏకంగా రూ. 11 కోట్ల మేర బకా యిలు పడింది. ఫ్యాక్టరీకి సర్వీసు నెంబరు ఎంసీఎల్‌- 008 పై రూ. 10 కోట్ల 35 లక్షల 47వేల 606, సున్న పురాయి తవ్వకాల కోసం క్వారీలో ఏర్పాటు చేసిన సర్వీ సు నెంబరు ఎంసీఎల్‌-014పై మరో రూ. 9 లక్షల 69 వేల 219 బకాయిలు ఉన్నాయని పేర్కొంటూ పలుమా ర్లు నోటీసులు జారీ చేసిన విద్యుత్‌శాఖ అధికారులు 2019 ఆగస్టు 10న క్వారీకి, అదే ఏడు నవంబరు 21న ఫ్యాక్టరీకి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో యాజమాన్యం నిరవధికంగా కంపెనీని మూసి వేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే యాజమాన్యం విద్యుత్‌ బిల్లులు చె ల్లించకుండా బకాయి పడిందనే ఆరోపణలు వ్యక్తమ వుతున్నాయి.

కేసు ఉండగానే ఈ-వేలానికి యత్నం...!

ఎంసీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య నెలకొన్న వి వాదం కోర్టులో కేసుల వరకు వెళ్లింది. గత నాలుగైదు సంవత్సరాలుగా కేసు పెండింగులోనే ఉంది. ఈ క్రమం లో యాజమాన్యం గతంలో ఓ బ్యాంకులో తీసుకున్న రుణం విషయమై నోటీసులు జారీ అయ్యాయి. కంపెనీ రుణం తిరిగి చెల్లించకపోవడంతో కంపెనీకి చెందిన ఆ స్తులను ఆన్‌లైన్‌ విధానంలో వేలం వేయాలని బ్యాం కు నిర్ణయించినట్లు కార్మికులు చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా వేలం వేయడాన్ని అడ్డు కొనే క్రమంలో గత వారం రోజులుగా కార్మికులు ఫ్యాక్టరీ వద్ద ఽమూకుమ్మడి ధర్నా చేస్తున్నారు. తాజాగా సోమ వారం కుటుంబాలతో కలిసి ఆంధోళనకు దిగిన కార్మికు లు వేలం వేయాలన్న ఆలోచనను బ్యాంకు అధికారులు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 13 , 2026 | 12:14 AM