మూసీని తోడేస్తున్నారు
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:10 AM
ప్రభుత్వ అనుమతితో ఇసుకను తరలించాలని నిబంధనలు ఉన్నా కాంట్రాక్టర్లు వాటిని పట్టించుకోవ డం లేదు.
అనుమతి మాటున ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
లారీలు, టిప్పర్లలో యథేచ్ఛగా తరలింపు
వాగుపై పదేళ్లుగా కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
సమాచారం ఉన్నా పట్టించుకోని అధికారులు
మూసీ ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. అనుమతి మాటున ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లారీలు, టిప్పర్లలో యథేచ్ఛగా ఇసుక తరలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మూసీ వాగుపై పదేళ్లుగా కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.
- ఆంధ్రజ్యోతి, అర్వపల్లి
ప్రభుత్వ అనుమతితో ఇసుకను తరలించాలని నిబంధనలు ఉన్నా కాంట్రాక్టర్లు వాటిని పట్టించుకోవ డం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి నల్లగొం డ జిల్లాలోని శాలిగౌరారం మండలం వంగమర్తి ఇసు కను రోజుకు 200లారీలు తరలిస్తున్నారు. కొన్నిటికి మాత్రమే ప్రభుత్వ అనుమతులతో వెళ్తున్నాయని నెలరోజుల క్రితం పరిసర ప్రాంతాల రైతులు, రాజకీ య నాయకులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మూసీ వాగునుంచి ఖమ్మం, జనగాం, హూజూర్‌నగర్ నియోజకవర్గాలకు ఇసుక తరలిస్తున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలో నిర్మించే ప్రాజెక్ట్‌కు ఇసుకను తరలిస్తున్నామని చెప్పి పలు ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారని విమర్శలున్నాయి. మూసీ వాగుపై పదేళ్లుగా కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఒక ప్రాంతానికి రవాణా చేయాల్సిన ఇసుకను మరో ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ జిల్లాల నుంచి మూసీ నదిలోకి బిక్కేరు వాగు నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు రా వడంతో మూసీ పరీవాహక ప్రాంతంలో ఇసుకతో నిండుతోంది. ఇసుక కోసం తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) అనుమతి తీసుకోవాలి. ఇసుక పూడికతీత పేరుతో స్టాక్ పాయిం ట్ నుంచి నేరుగా లారీలు, టిప్పర్లలో అక్రమంగా ఇసుక నింపుకొని బయటికి తరలిస్తున్నారు. టీజీఎండీ సీ ఇసుక స్టాక్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలేదు. మిగతా లారీలను నామమాత్రంగా కాంట్రాక్టర్లు వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇసుక దొరకక స్థానికుల ఇబ్బందులు
అధికారంలో ఎవరు ఉన్నా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. అనుమతుల కోసం ఉన్నతస్థాయిలో ఒత్తిడి చేసి ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్న వారికి మాత్రం ఆన్‌లైన్‌లో ఇసుక దొరకడం లేదు. అధిక డబ్బులు వెచ్చించి ఇసుక కొనుగోలు చేస్తున్నామని స్ధానికులు పేర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రాజెక్ట్‌ల పేరుతో అనుమతి పొంది ఎక్కువ ఇసుక తరలిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు మెట్రిక్ టన్ను ఇసుకను రూ.90 విక్రయిస్తుండగా, మన ఊరు మన ఇసుక, ఇందిరమ్మ ఇళ్లకు మెట్రిక్ టన్నుకు రూ.90చెల్లించాల్సి ఉండగా ప్రైవేట్ వ్యక్తులకు మెట్రిక్ టన్నుకు రూ.400 వరకు విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీజీఎండీసీ అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సిన ఇసుక రవాణా, అన్ని శాఖలు పోలీస్, రెవెన్యూ,. మైనింగ్ అధికారుల సహకారంతో ప్రభుత్వ పనుల పేరుతో డీడీలను పొందుతున్న కాంట్రాక్టర్లు టిప్పర్లతో ప్రైవేట్ వ్యక్తులకు హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, వరంగల్ ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. పది రోజుల క్రితం వంగమర్తి వాగు నుంచి నల్లగొండకు వెళ్లాల్సిన ఇసుక లారీ సూర్యాపేట వైపు వెళ్తుండడంతో అర్వపల్లి పోలీసులు పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఇసుక వాగులో ఉన్న పది మందిని విచారించారు. ఇసుక అక్రమ దందా కొనసాగుతోందని ఈ లారీ నిరూపించిందని స్ధానికులు వాపోతున్నారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టుకున్నది వాస్తవమే
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి ఇసుక వాగు నుంచి అర్వపల్లి వైపు ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీని అర్వపల్లి ఎస్‌ఐ సైదులు పట్టుకొని సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమో దు చేశారు. ఆన్‌లైన్‌లో నల్లగొండ ప్రాంతానికి అనుమతి పొందగా సూర్యాపేటకు తరలిస్తుండగా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎలాంటి అనుమతులు లేని ఇసుక లారీని పట్టుకున్నాం. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంతటివారిపైనైనా కేసులు నమోదు చే సి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
- నాగేశ్వర్‌రావు, నాగారం సీఐ