Share News

కేసుల విచారణలో పారదర్శకంగా ఉండాలి

ABN , Publish Date - May 13 , 2026 | 11:08 PM

ఎఫ్‌ఐఆర్‌ నమో దు నుంచి చార్జీషీట్‌ వేసే వరకు ప్రతీ అంశం పారదర్శకంగా ఉండా లని ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ సూచించారు.

కేసుల విచారణలో పారదర్శకంగా ఉండాలి
నేరాలపై సమీక్షిస్తున్న ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌

- నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం, మే 13 (ఆంధ్రజ్యోతి) : ఎఫ్‌ఐఆర్‌ నమో దు నుంచి చార్జీషీట్‌ వేసే వరకు ప్రతీ అంశం పారదర్శకంగా ఉండా లని ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశం బుధవారం ఎస్పీ తన కార్యాలయ సముదాయంలో నిర్వహించారు. ఈ సంద ర్భం గా ఎస్పీ మాట్లాడుతూ కేసుల విషయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి ప్రతీ అంశం క్షు ణ్ణంగా పరిశీలించి చార్జ్‌షీట్‌ వేసే వరకు పార దర్శకంగా ఉండాలని గుర్తించారు. బాధి తులకు సకాలంలో న్యాయం జరిగే విధంగా చూడడమే ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కే సుల విచారణలో వేగంగా పారదర్శకంగా జర గాలని ఆయన పేర్కొన్నారు. నేరాల నమోదు, పెండింగ్‌ కేసులు, కోర్టు మానిటరింగ్‌, డయల్‌ 100కాల్స్‌ సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్‌ ప్రజా ఫిర్యాదులపై స్పందన, సైబర్‌ క్రైమ్‌ల కేసు ల్లో బాధితులకు నగదు రీఫండ్‌, దొంగతనాల నగదు రీఫండ్‌, దొంగతనాల కేసుల్లో డిటెక్షన్‌, మర్డర్‌ అనుమానాస్పద మృతి కేసుల్లో డిటెక్షన్‌ మొదలైన అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌ కేసులు లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, డీఎస్పీలు సాయి వెంకట్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసులు, సీఐ, ఎస్‌ఐలు, రైటర్లు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 11:08 PM