అంగన్‌వాడీలపై పర్యవేక్షణ ఉండాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:28 PM
చ్చం పేట డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వ హణపై సీసీడీపీవోలు, సూ పర్‌వైజర్లు ప్రత్యేక పర్యవేక్ష ణ చేయాలని స్థానిక ఎమ్మె ల్యే డాక్టర్ వంశీ కృష్ణ అన్నారు.
- సీడీపీవోలు, సూపర్‌వైజర్ల సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : అచ్చం పేట డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వ హణపై సీసీడీపీవోలు, సూ పర్‌వైజర్లు ప్రత్యేక పర్యవేక్ష ణ చేయాలని స్థానిక ఎమ్మె ల్యే డాక్టర్ వంశీ కృష్ణ అన్నారు. సూపర్‌వైజర్లు, సీడీపీవోలతో ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాల యంలో మంగళవారం సమీక్షా సమావేశం ని ర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, పిల్లలు, గర్భిణులకు అందుతున్న సేవలు, పోష కాహార పంపిణీ, ప్రీ-స్కూల్ విద్య అమలు తది తర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అన్నారు. అం గన్‌వాడీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, సేవలనాణ్యతను మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.
సంప్రదాయ బద్ధంగా పూజలు చేయాలి
బల్మూరు, (ఆంధ్రజ్యోతి) : మన పూర్వీకులు సంప్రదాయ బద్ధంగా దేవతలకు పూజ చేసే కార్యక్రమాన్ని మనం కూడా పాటిస్తే గ్రామంలో శాంతి నెలకొంటుందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కు డు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మండల పరిఽధిలోని జిన్‌కుంట గ్రామంలో గొల్లొల్ల ఎల్లమ్మ పండుగ సందర్భంగా గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎల్లమ్మ దేవతకు స్థానికులతో కలిసి ఎమ్మెల్యే పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కృష్ణయ్య, నాయకుడు కొండ శివగౌడ్, యాదవ సంఘం గ్రామ అధ్యక్షుడు సత్యనారి, నాయకు లు తిరుపతయ్య, నరసింహ, మల్లయ్య, నడిపి బాలయ్య, శ్రీశైలం, లింగం, ఆంజనేయులు, మహేశ్, గొర్ల చెన్నయ్య పాల్గొన్నారు.