Share News

మౌలిక సదుపాయాలతో పునరావాస కేంద్రం ఉండాలి

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:36 PM

కలె క్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మంగళవారం మం డలంలో విస్తృతంగా పర్యటించారు. మొదట మండల పరిధిలోని బాచారం గ్రామ శివారులో నల్లమలలోని చెంచులకు నిర్మిస్తున్న పునరావాస పనులపై సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

మౌలిక సదుపాయాలతో పునరావాస కేంద్రం ఉండాలి
బాచారం అటవీ ప్రాంతంలోని పునరావాస కేంద్రంలో సమగ్ర లే అవుట్‌ మ్యాపును పరిశీలిస్తున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

పెద్దకొత్తపల్లి, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : కలె క్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మంగళవారం మం డలంలో విస్తృతంగా పర్యటించారు. మొదట మండల పరిధిలోని బాచారం గ్రామ శివారులో నల్లమలలోని చెంచులకు నిర్మిస్తున్న పునరావాస పనులపై సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడి నుంచి బాచారం గ్రా మంలో బీఎల్‌వోలు చేపడుతున్న ఓటరు జాబి తా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం మండల కేం ద్రమైన పెద్దకొత్తపల్లిలో కస్తూర్బా గాంధీ బాలిక ల విద్యాలయాయాన్ని ఆయన తనిఖీ చేశారు. బాచారం అటవీ ప్రాంతంలో అన్ని మౌలిక సదు పాయాలతో పునరావాస కేంద్రాన్ని అభివృద్ధి చే యాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ సూ చించారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల స్వచ్ఛంద పునరావాసం కోసంపెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీ పనులను కొల్లాపూర్‌ ఆర్డీవో బన్సీలాల్‌, జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్‌చంద్ర తో కలిసి కలెక్టర్‌ మంగ ళవారం పరిశీలించారు. సమగ్ర లేఅవుట్‌ మ్యా ప్‌ను కలెక్టర్‌ పరిశీలిం చారు. ఈ సందర్భంగా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రతిపాదిత లేఅవుట్‌, ప్లాట్ల విభజన, రహదారుల నిర్మాణం, తాగునీటి వనరులు, విద్యుత్‌ కనెక్షన్లు, ప్రజావి నియోగ స్థలాల కేటాయింపు తదితర అంశాల ను కలెక్టర్‌కు వివరించారు. బాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ ఐఆర్‌) ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. గ్రామ స్థుల విజ్ఞప్తి మేరకు శిథిలావస్థలో ఉన్న ప్రాథ మిక పాఠశాలను కలెక్టర్‌ పరిశీలించారు. మర మ్మతులు చేయించాలని అధికారులను ఆదేశిం చారు. అనంతరం పెద్దకొత్తపల్లిలో కేజీబీవీని కలె క్టర్‌ తనిఖీచేశారు. విద్యార్థినుల సౌకర్యాలు, ఆ హార నాణ్యత, పరిశుభ్రతపై క్షుణ్ణంగా పరిశీ లించారు. త్వరలోనే రెగ్యులర్‌ ప్రత్యేక అధికారిని నిమిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేజీబీవీల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికా రులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అటవీశాఖ అధికారి రేవంత్‌చం ద్ర, కొల్లాపూర్‌ ఆర్డీవో బన్సీలాల్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, బాచారం గ్రామ సర్పంచ్‌ నిర్మల, పెద్దకొత్తపల్లి సర్పంచ్‌ రేణుక, సంబంధిత శాఖల అధికారులు, బీఎల్‌వో, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతి నిధులు, కేజీబీవీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:36 PM