Share News

కార్మిక,ప్రజల సామాజిక అభివృద్ది శూన్యం

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:32 PM

దేశానికి మతోన్మాద రాజకీయాలు ప్రమాదకరమని, కార్మిక, ప్రజల సామాజిక అభివృద్ధి శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ ద్వజమెత్తారు.

కార్మిక,ప్రజల సామాజిక అభివృద్ది శూన్యం
నస్పూర్‌లో జరిగిన సమావేశంలో అభివాదం చేస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శంకర్‌

నస్పూర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : దేశానికి మతోన్మాద రాజకీయాలు ప్రమాదకరమని, కార్మిక, ప్రజల సామాజిక అభివృద్ధి శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ ద్వజమెత్తారు. మండల కార్య దర్శి జోగుల మల్లయ్య అధ్యక్షతన సీసీసీ కార్నర్‌ వద్ద శుక్రవారం సాయం త్రం విద్యా వైద్య ఉపాధి కోసం ప్రజాపోరు యాత్ర ముగింపు సభ జరిగిం ది. అంతకు ముందు షిర్కె కాలనీ చౌరస్తా నుంచి సీసీసీ కార్నర్‌ వరకు ఉరేగింపు నిర్వహించారు. సీసీసీ కార్నర్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్‌ మాట్లాడుతూ కార్మికులు, రైతులు, కూలీలు,యువత, మహిళలు, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం సెప్టెం బరు 1న చలో డిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, చలో డిల్లీని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి, రామడుగు లక్ష్మన్‌, నాయకులు మేకల దాసు, చంద్రశేఖర్‌, వీరభద్రయ్య, లింగయ్య, కారుకూరి నగేష్‌, ఖలేందర్‌, లింగం రవి, చంద్రక ళ, బాజీ సైదా, సమ్మయ్య, రాజేశ్వర్‌ రావు, కిషన్‌ రావు, రవీందర్‌, దేవి పోచన్న, పౌల్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 11:32 PM