అభివృద్ధిలో ఏ మాత్రం తగ్గేదేలేదు..
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:01 PM
లక్షెట్టిపేట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అబివృద్ధి చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం లక్షె ట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల చెరువు సుందరీకరణ పనుల ప్రా రంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
లక్షెట్టిపేట, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అబివృద్ధి చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం లక్షె ట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల చెరువు సుందరీకరణ పనుల ప్రా రంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈసం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించారని, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానన్నారు. ఇటిక్యాల చెరువు సుందరీకరణకు రూ. 3.14కోట్లు మంజూరయ్యాయని ఒక్క పైసా వృధా కాకుండా ఈవ ర్షాకా లం కాకుండా మళ్లీ వచ్చే వర్షాకాలానికి పూర్తి చేస్తామన్నారు. పట్టణం లో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులు కూడా వేగంగా చేస్తామన్నారు. చెప్పిన మాట ప్రకారం ఇటిక్యాల రోడ్డు 40ఫీట్లు, ఊత్కూర్ నుంచి పాత బస్టాండ్ వరకు 80ఫీట్లు, గోదావరి రోడ్డు 60ఫీట్లు అంగడి బజార్ నుంచిఇటిక్యాల చెరువు వరకు 30ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణలో కొంత మందికి ఇష్టం లేకున్నా పనులు మాత్రం ఆగవని చేపట్టే పనులు రానున్న మూడు తరాల వాళ్లు మెచ్చే విధంగా ఉంటాయన్నారు. ఇది ఒక్కటే కాకుండా మహాలక్ష్మివాడ నుంచి బోయవాడ మీదుగా గోదావరి రోడ్డు కూడా రానున్న రోజుల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఇటిక్యాల చెరువు విషయంలో ట్యాంక్‌బండ్‌ను మరిపించే విధంగా చేసి చూపిస్తానన్నారు. రానున్న రోజుల్లో మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా రోడ్డు, డ్రైన్ పనులు మొదలు పెడతామని అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తారన్నారు. అనంతరం ఇటిక్యాల చెరువు సుందరీ కరణ పనుల కోసం వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయ కొట్టి శిలాఫలకం ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ రాజేశ్వరి వెంకటస్వా మిగౌ డ్, మన్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఈఈ గంగాదర్, డీఈ మధూకర్, ఏఈ రత్నవీణ, కౌన్సిలర్లు చిన్నయ్య, సువర్ణ, బోడ రాజు, పెండెం పద్మ, చంద్రమౌళి, పర్వీన్‌సుల్తానా, బిరుదు ల సత్యనారాయణ, గోపె సుజాత రమేష్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరీఫ్, మండల అధ్యక్షుడు రమేష్, మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీ డర్ చెల్ల నాగభూషణం నాయకులు షాహెద్, కందుల మోహన్, ముత్తె సుధాకర్, చింత అశోక్ పాల్గొన్నారు.