Share News

యువత మత్తు పదార్ధాలకు బానిస కావద్దు

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:42 PM

యువత మత్తు పదార్ధాలకు బానిస కావద్దని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు.

యువత మత్తు పదార్ధాలకు బానిస కావద్దు

రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

కాసిపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : యువత మత్తు పదార్ధాలకు బానిస కావద్దని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. గురువారం దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని వెం కటాపూర్‌లో కమ్యూనిటీ పోలీసులో భాగంగా నిర్వ హించిన ఉచిత వైద్య శిబిరానికి ఆయన అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. నేటియువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్ధాలకు బానిసై వారి విలువైన జీవితాలను కోల్పోతున్నారని ఇది సరైంది కాదన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మం చి భవిష్యత్‌ ఉంటుందన్నారు. వాహనదారులు రో డ్డు భద్రత నియమాలు పాటించకుండా రాష్‌ డ్రై వింగ్‌చేస్తూ రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతూ కు టుంబాలను వీధీ పాలు చేస్తున్నారన్నారు. ప్రతి వా హనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ దరిం చి నడపాలని, మైనర్‌ పిల్లలకు వాహనాలు ఇవ్వ వద్దని, మద్యం సేవించి ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దన్నారు. ప్రతి గ్రామంలో వి ద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందడం చాలా ఆనందదాయకమన్నారు. గ్రామాల్లో సైతం మంచి పాఠశాలలు ఏర్పాటు కా వడంతో పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నా రన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యా లను ప్రభుత్వం కల్పిస్తుందని, విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవా లన్నారు. గ్రామాల్లోని ప్రజలందరు కలిసి మెలిసి ఉండాలన్నారు. ప్రస్తుతం అటవీ శివారు ప్రాంతాల్లో కూడా శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని, ప్ర జలు ఎవరు కూడా భయాందోళనలకు గురి కావా ల్సిన అవసరం లేదని, స్వేచ్చగా రాకపోకలు సాగిం చవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. ప్రజలు రక్షణకు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సిద్ధంగా ఉంటారని, ప్రజ లందరు పోలీసులకు సహకరించాలన్నారు. మంచి ర్యాల మెడిలైఫ్‌, సన్‌రైజ్‌ ఆసుపత్రుల వారు ఉచి తంగా వైద్యసేవలందించడం ఆనందంగా ఉంద న్నారు. సుమారు వెయ్యి మందికి వైద్య పరీక్షలు చే శారు. పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని నిర్వహించిన దే వాపూర్‌ ఎస్‌ఐ గంగారాం, పోలీసులను సీపీ అభి నందించారు. కార్యక్రమానికి హాజరైన సీపీ అంబర్‌ కిశోర్‌ ఝాకు గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి ఏసీపి కిరణ్‌కుమార్‌, మందమర్రి సీఐ రమేష్‌, దేవాపూర్‌ ఎస్‌ఐ గంగా రాం, కాసిపేట ఎస్‌ఐ ఆంజనేయులు, మందమర్రి ఎస్‌ఐ నరేష్‌, రామకృష్ణపూర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌, మెడి లైఫ్‌ వైద్యులు కుమారస్వామి, గౌతమ్‌, శ్రీనివాస్‌, వినయ్‌, బోస్‌, సాప్రిక, సన్‌రైజ్‌ ఆసుపత్రి వైద్యులు రాజ్‌కుమార్‌, స్తానిక సర్పంచు పెంద్రం శంకర్‌, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 11:43 PM