kumaram bheem asifabad- యువత నైపుణ్యం పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:01 PM
యువత నైపుణ్యం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్ పటేల్ గార్డెన్‌లో శనివారం ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు స్పందన లభించిది. మేళాను సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు ప్రారంభించారు.
కాగజ్‌నగర్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): యువత నైపుణ్యం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్ పటేల్ గార్డెన్‌లో శనివారం ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు స్పందన లభించిది. మేళాను సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత సాదికారతవైపు నడిపించటానికి ఈ మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. యువతీ యువకులు నైపుణ్యాల మెరుగుదల, సమాచార నైపుణ్యాలను పెంపొందించుకోవడం పై దృష్టి పెట్టాలని చెప్పారు. తద్వారా ఉపాధి పొందవచ్చని తెలిపారు. మేళాకు విచ్చేసిన 45 కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్ ప్రతినిధులకు, నిరుద్యోగులకు భోజన వసతి కల్పించారు. ఈ జాబ్ మేళాలో నిర్వహకులు చందర్, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దోని శ్రీశైలం, కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్‌రావు, నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, శివగౌడ్, మనోహర్ గౌడ్, కొప్పుల శంకర్, ఎల్ముల మల్లయ్య, పుల్ల ఆశోక్, విజయ్, రాజేశ్వర్, మోతీరాం, సర్పంచులు లావణ్య, మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.