కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలి
ABN , Publish Date - Jul 26 , 2026 | 09:50 PM
కార్మికులపై పనిభారా న్ని తగ్గించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అక్బర్ అలీ, ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏఐటీయూసీ నాయకులు
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : కార్మికులపై పనిభారా న్ని తగ్గించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అక్బర్ అలీ, ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 2న ఆలిండియా ట్రేడ్ యూ నియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభ మంచిర్యాలలో జరగనుం దన్నారు. ఈ సభలో కార్మికులకు సంబంధించిన హక్కులు, సమస్యల పరి ష్కారంపై చర్చిస్తామన్నారు. అదే రోజు ఉదయం ఐబీ నుంచి కార్మిక ప్రద ర్శన ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పట్టిం చుకోవడం లేదన్నారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్‌సోర్సింగ్, కార్మికుల హక్కులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సభలో కార్మికులు పాల్గొని విజయవం తం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు సమ్మయ్య, కలీందర్ ఆలీఖాన్, వీరభద్రయ్య, మల్లేష్, బాజీసైదా, సత్యనారాయణ, పోశం, సుదర్శన్, రవీందర్ పాల్గొన్నారు.