kumaram bheem asifabad- కూలీలకు నిరాశే
ABN , Publish Date - Jul 04 , 2026 | 10:45 PM
గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి భరోసా కల్పిస్తామన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిష న్-గ్రామీణ్(వీబీ జీరామ్‌జీ)చట్టం కూలీలకు నిరాశను కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్‌జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకి రాగా తెలంగాణకు మాత్రం నిరాశను మిగిల్చింది. కొత్త చట్టం అమలులోకి తీసుకురావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచు తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- పని దినాల పెంపుతోనే సరి
- ఉపాధి వేతనాలను నోటిఫై చేసిన కేంద్రం
బెజ్జూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి భరోసా కల్పిస్తామన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిష న్-గ్రామీణ్(వీబీ జీరామ్‌జీ)చట్టం కూలీలకు నిరాశను కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్‌జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకి రాగా తెలంగాణకు మాత్రం నిరాశను మిగిల్చింది. కొత్త చట్టం అమలులోకి తీసుకురావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచు తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడిచిన మార్చి నెలలోనే వేతనాలు పెంచాల్సి ఉండగా కొత్త చట్టం తీసుకవస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో వేతన పెంపును వాయిదా వేసింది. కాగా బుదవారం నుంచి వీబీ జీరామ్‌జీ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వేతనాలను నోటీఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది.
- పేదలకు నిరాశ..
వీబీ జీరామ్‌జీ చట్టం రాష్ట్రంలోని పేదలకు నిరాశ కలిగించింది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ వేతనాలను పెద్దగా పెంచలేదు. కొత్త చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా కనిష్టంగా రూ.300, గరిష్ఠంగా రూ.409ఉండాలని కేంద్రం నిర్ణయించింది. గతేడాది తెలంగాణలో ఉపాధి కూలీల వేతనాలు గరిష్టంగా రూ.307ఉండగా, ఈసారి కేవలం రూ.1 పెంచి రోజూవారీ వేతనాన్ని రూ.308కి పరిమితం చేసింది. కొన్ని రాష్ర్టాల్లో రూ.400పైనే రో జూవారీ వేతనాలు ఇచ్చారు. 2024-25సంవత్సరంలో రాష్ట్రం లో రోజూవారీ వేతనం గరిష్ట వేతనం రూ.300ఉం డగా, 2025-26 సంవత్సరంలో రూ.307కి పెంచారు. కాగా ఇప్పుడు కేవలం రూ.1పెంచి రూ.30 8చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రూ.5పెంచి రూ.312చేశారు. అత్యధికంగా హరియాణలో రూ.40 9ఇవ్వగా, సిక్కింలోని మూడు గ్రామపంచాయతీల్లో మాత్రం ఏకంగా రూ.450కు పెంచారు. కొత్త చట్టం లో వేతన పెంపు భారీగా ఉంటుందని భావించిన ఉపాధి కూలీలకు, రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే ఎదు రైంది. కానీ ప్రతి కూలీకి రోజూవారీ కూలీ రూ.300కు తగ్గరాదని సూచించింది. ఈ లెక్కన ప్రతి కూలీకి రోజుకు రూ.300చొప్పున వస్తాయి.
- వేతనం విషయంలో..
రోజూవారీ వేతన విషయంలో నిరాశ కలిగించగా పని దినాల పెంపు వల్ల ఉపాధి కూలీలకు ఊరట కలగనుంది. ఉపాధి హామీ పథకాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న కుటుంబాలు రాష్ట్రంలో చాలా ఉంటాయి. ఉపాధి పనితో పాటు ఇతర కూలీ పనుల ు చేస్తూ పొట్ట నింపుకునే కుటుంబాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల పని దినాలను 100 రోజుల నుంచి 125రోజులకు పెంచింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుం బానికి 100రోజులు కల్పిస్తుండగా ఇక నుంచి 125 రోజుల పని దినాలను కల్పిస్తారు. ఒక్కో పని దినానికి రోజుకు రూ.300చొప్పున 125పని దినాలకు రూ.37, 500రానున్నాయి. గతంలో సగటు వేతనం రూ.298 కాగా కూలీలకు మాత్రం రూ.200, రూ.250 అంత కన్నా తక్కువగా వచ్చిన సందర్బాలు కూడా ఉన్నా యి. కానీ ఈ చట్టం ప్రకారం కచ్చితంగా రూ.300 అందనున్నాయి.
- జిల్లాలో 84 వేల జాబ్‌కార్డులు
జిల్లా వ్యాప్తంగా 15 మండలాలు, 335 గ్రామ పం చాయతీల పరిధిలో 84వే ల జాబ్‌కార్డులు, 1.54లక్షల మంది కూలీలు, ఇందులో పని చేసే కూలీలు 1.15 లక్షల మంది ఉన్నారు. ఒక్కో జాబ్ కార్డుకు 125 పని దినాలు అవకాశం ఉండగా ఒక కోటి 43లక్షలకు పైగా పని దినాలకు అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లాలోని ఉపాధి కూలీ లకు కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది.