Share News

kumaram bheem asifabad- జూన్‌2 లోగా ఇందరిమ్మ ఇళ్ల పనులు పూర్తవ్వాలి

ABN , Publish Date - May 14 , 2026 | 10:46 PM

ఇందిరమ్మ ఇళ్ల పనులు జూన్‌ 2వ తేదీలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండలంలోని కోలాంకోటారి, కొత్తగూడ గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జూన్‌ 2 లోగా ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు.

kumaram bheem asifabad- జూన్‌2 లోగా ఇందరిమ్మ ఇళ్ల పనులు పూర్తవ్వాలి
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె హరిత

కెరమెరి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పనులు జూన్‌ 2వ తేదీలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండలంలోని కోలాంకోటారి, కొత్తగూడ గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జూన్‌ 2 లోగా ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు. ఇంటి నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడారు. ఫార్మట్‌ ప్రకారం కడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పకడ గది, వంట గది, మరుగుదొడ్లు, హాల్‌ అన్ని నిర్దేశిత నమునా ప్రకారం కట్టుకోవాలన్నారు. గ్రామానికి 110 ఇండ్లు మంజూరు చేయగా 108 ఇళ్ల పనులను ప్రారంభించామని తెలిపారు. ఏడు ఇళ్లు పూర్తయ్యాయని అన్నారు. మిగితా ఇళ్ల్లు వివిద దశల్లో ఉన్నాయని తెలిపారు. అందులో 86 స్లాబ్‌ వేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్లను పూర్తి నాణ్యతతో నిర్మించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఆమె వెంట హౌసింగ్‌ పీడీ ప్రకాష్‌రావు, డీఈ వేణుగోపాల్‌, ఎంపీడీవో సురేష్‌, ఎంపీవో సాయిరాంగౌడ్‌, సర్పంచ్‌ శాంతబాయి, కార్యదర్శి సతీష్‌ తదితరులు ఉన్నారు.

మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధజలం అందించాలి

జిల్లాలో వేసవి కాలం దృష్ట్యా ప్రతి గ్రామానికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా శుద్ధజలం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండలంలోని ధనోర గ్రామంలోని మిషన్‌ భగీరథ పంపు హౌస్‌లను సందర్శించి కలెక్టర్‌ పలు విభాగాలను పరిశీలించారు. పంపు హౌస్‌ నుంచి ఎన్ని మండలాలకు తాగునీరు పంపింగ్‌ చేస్తారని గ్రామాలకు నీరు అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా తాగునీరుకు ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామానికి పంపింగ్‌ చేయాలన్నారు. మోటార్ల పైపు లైన్‌లు ఏమైనా లీకేజీలు ఉంటే మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. తాగునీరును నిరంతరం సరఫరా అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 10:46 PM