kumaram bheem asifabad- పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 17 , 2026 | 10:47 PM
జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య ఆదీనంలో గల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చితానందాచారితో కలిసి శుక్రవారం జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య ఆదీనంలో గల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చితానందాచారితో కలిసి శుక్రవారం జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, క్రీడా స్థలాల అభివృద్ధి క్రీడా పరికరాల కొనుగోలు అంశాలను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంతల పనులు చేపట్టాలని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల భవనాల నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులసంఖ్య పెంపొందించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని, డ్రా బ్యాక్‌లో ఉన్న విద్యార్థులను ఆన్‌లైన్ చేయాలని తెలిపారు. కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు శాతం తక్కువ నమోదుపై కారణాలను తెలుసుకున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న బోజనం నాణ్యతగా ఉండాలని చెప్పారు. పోషక విలువలతో పరిమాణంతో కూడిన భోజనాన్ని అందించాలని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని ప్రతి పాఠశాలను పర్యవేక్షించాలని, అపార్ 53 శాతం, ఆధార్ 90 శాతం ఉందని వీటి శాతం పెంపొందించాలని పాఠశాల వివరాలను యూడైస్ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 118 ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థులను 100 శాతం చేర్పించాలని మండల విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేలా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సమావేశంలో ఎంఈవోలు, పంచాయతీరాజ్, డబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.