Share News

kumaram bheem asifabad-పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:57 PM

జిల్లాలో టెలికాం సేవలను మరింత మెరుగు పరిచేందుకు సెల్‌ టవర్ల నిర్మాణం, ఆప్జికల్‌ పైబర్‌ కేబుల్‌ విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

kumaram bheem asifabad-పనులను వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో టెలికాం సేవలను మరింత మెరుగు పరిచేందుకు సెల్‌ టవర్ల నిర్మాణం, ఆప్జికల్‌ పైబర్‌ కేబుల్‌ విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మారు మూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో డిజిటల్‌ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నందున టెలికాం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టికి సారించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే మంజూరైన సెల్‌ టవర్ల నిర్మాణం, పూబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణ పనుల పురోగతిపై సమీక్షిం భూ సమస్యలు, అనుమతులు తదితర అంశాలను త్వరిగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిరంతరాయంగా కమ్యూనికేషన్‌ సేవలు అందించేందుకు టెలికాం సంస్థలు పరస్పర సమస్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏడీ సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ వినయ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, ఎయిర్‌టెల్‌ తదితర టెలికాం సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

వలంటీర్లతో వర్చువల్‌ సమావేశాలు

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22న పటేళ్లు, బూత్‌ స్థాయి అధికారులు, వలంటీర్లతో వర్చువల్‌ సమావేశాలు నిర్వహించి అవగాహన కలిస్తామని కలెక్టర్‌ హరిత అన్నారు. హౌదరాబాద్‌లోని రాష్ట్ర ఎలకో్ట్రరల్‌ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఏఈఆర్‌వోలతో రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్‌ అధికారి సుదర్శణ్‌రెడి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. హైదరాబాద్‌లోనిఈ నెల 25 నుంచి జూలై 24 వరకు చేపట్టే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులు, బూత్‌ స్థాయి ఏజెంట్లకు శిక్షణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఎన్యూమరేషన్‌ ఫారం నింపే విధానాన్ని బూత్‌ స్థాయమి అధికారులకు వివరించాలని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డులు ధరించాలని, ప్రతి రోజు సేకరించిన ఎన్యుమరేషన్‌ ఫారాల లోని వివరాలను అదే రోజు యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు ప్రతి రోజు పర్యటించి బూత్‌ స్థాయి అధికారులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ సముదాయంలోని వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ కెహరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 22న పటేళ్లు, బూత్‌ స్థాయి అధికారులు, వలంటీర్లతో వర్చువల్‌ సమావేశాలు నిర్వహించి ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణపై వివరించనున్నామని చెప్పారు. ప్రతికలలో, ఎలకా్ట్రనిక్‌ మీడియాలలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 10:57 PM