Share News

kumaram bheem asifabad- పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jun 12 , 2026 | 10:25 PM

నిరుద్యోగ యువతకు శిక్షణను అందించి వారి భవిష్యత్‌కు తోడ్పడేలా నిర్మిస్తున్న స్కిల్స్‌ సెంటర్‌ భవనం పనులను వేగవంతం చేసి త్వరలో వినియోగంలోకి తీసుకు రావాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రీయల్‌ ఏరియాలో పాత కలెక్టరేట్‌ భవనం వెనక రూ.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న స్కిల్స్‌ సెంటర్‌ భవనం పనులను శుక్రవారం పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ ధర్మేందర్‌తో కలిసి పరిశీలించారు.

kumaram bheem asifabad-  పనులు వేగవంతం చేయాలి
పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు శిక్షణను అందించి వారి భవిష్యత్‌కు తోడ్పడేలా నిర్మిస్తున్న స్కిల్స్‌ సెంటర్‌ భవనం పనులను వేగవంతం చేసి త్వరలో వినియోగంలోకి తీసుకు రావాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రీయల్‌ ఏరియాలో పాత కలెక్టరేట్‌ భవనం వెనక రూ.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న స్కిల్స్‌ సెంటర్‌ భవనం పనులను శుక్రవారం పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ ధర్మేందర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో భాగంగా స్కిల్స్‌ సెంటర్‌ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్‌ అందుబాటులోకి రావడం వల్ల జిల్లాలోని నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి వారు స్వయం ఉపాధి పొందేందుకు, సొంతంగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త సాంబశివరావు, ఏఈ గోపాల్‌, టాస్క్‌ జిల్లా మేనేజర్‌ రాకేష్‌, లక్ష్మికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 10:25 PM