Share News

kumaram bheem asifabad-పనులు సాగక.. వేతలు తీరక..

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:28 PM

కుమరం భీం జిల్లాలో అభివృద్ధి పనులు ముందుకు సాగక పోవడంతో ప్రజలకు వెతలు తీరడం లేదు. వివిధ మండలాల అనుసంధానంగా ఉన్న వంతెనలు, రోడ్ల కు నిర్మాణాల పనులు ఇంకా పూర్తి కావడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా కూడా వీటి పరిస్థితిపై అధికారులు, నాయకులు పట్టించుకోక పోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిం ది.

kumaram bheem asifabad-పనులు సాగక.. వేతలు తీరక..
లోగో

- రాకపోకలకు వాహనదారుల అవస్థలు

- ఏళ్లు గడుస్తున్నా మారని దుస్థితి

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లాలో అభివృద్ధి పనులు ముందుకు సాగక పోవడంతో ప్రజలకు వెతలు తీరడం లేదు. వివిధ మండలాల అనుసంధానంగా ఉన్న వంతెనలు, రోడ్ల కు నిర్మాణాల పనులు ఇంకా పూర్తి కావడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా కూడా వీటి పరిస్థితిపై అధికారులు, నాయకులు పట్టించుకోక పోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిం ది. దీంతో ఆయా మండలాలకు రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

- అంకుసాపూర్‌ వద్ద..

కాగజ్‌నగర్‌-వాంకిడి మధ్యలో ఉన్న అంకుసాపూర్‌ వద్ద బ్రిడ్జి నిర్మాణం 2013లో రూ.1.50 కోట్లతో పను లను ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన నిధుతో పనులు ప్రారంభించారు. రాష్ట్రాలు విడి పోవడంతో ఈ వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల కాలేదు. దీంతో పనులు పెండింగ్‌లో ఉండాల్సి వచ్చింది. ఏళ్లు గడుస్తుండడంతో వంతెన నిర్మాణానికి సంబంధించిన మెటిరియల్‌ ధరలు రెండింతలు పెరుగడంతో కాంట్రాక్టర్‌ చేతులెత్తారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లయింది. పెండింగ్‌ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం సర్వేలు చేపట్టింది. ఈ సర్వేలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.3 కోట్ల నిధులు అవసరం అవుతాయని తేల్చింది. దీంతో మూడేళ్ల క్రితం రూ.3కోట్ల నిధులను పెంచింది. కాని ఆశించిన మేర నిధులు విడుదల కాలేదు. దీంతో పనులు మందుకు సాగడం లేదు. కాగజ్‌నగర్‌ నుంచి వాంకి డికి వెళ్లాలంటే ఆసిఫాబాద్‌ మీదుగా సరిగ్గా 41 కిలో మీటర్లు దూరం ఉంటుంది. ఆసిఫాబాద్‌కు మీదుగా కాకుండా కాగజ్‌నగర్‌ నుంచి అంకుసాపూర్‌ మీదుగా వాంకిడికి వెళ్లితే 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రవాణా సౌకర్యంతో పాటు దూరం తగ్గుతుందన్న ఉద్దేశ్యంతో అంకుసాపూర్‌ వాగుపై ఉన్న వంతెన నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. కానీ ఈ వంతెన ఫిల్లర్ల స్థాయి వీడని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తాత్కాలికంగా పైపులు వేసి మట్టి రోడ్డు వేశారు. చిన్న పాటి వర్షం కురిసిందంటే ఈ వం తెనకు సమీపం దూరంలో కొండలపై నుంచి నీరు అధికంగా వచ్చి తాత్కాలిక రోడ్డు కొట్టుక పోతోందని గ్రామస్థులు చెబుతున్నారు. వర్షా కాలంలో ఎడ్ల బండి సహాయంతోనే వాగు దాటాల్సి ఉంటుందని, బైక్‌లను కర్రల సహాయంతో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామాలకు రవాణా వ్యవస్థ మెరుగు పడేలా వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- జగన్నాథ్‌పూర్‌ మీదుగా

కాగజ్‌నగర్‌-భీమిని మండలాల అనుసంధానంగా ఉండేందుకు జగన్నాథ్‌పూర్‌ మీదుగా వెళ్లే రహదారి ఉంది. ఈ రహదారిపై పాలవాగు ఉంది. ఈ వాగు కూడా చిన్నపాటి వర్షానికే ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు గంటల తరబడి నిలిచిపోతున్నా యి. ఎడ్లబళ్ల ద్వారానే ఈ వాగును దాటాల్సిన పరిస్థి తి ఏర్పడింది. ఈ రెండు మండలాలకు అనుసంధా నంగా ఉన్న రోడ్లను అభివృద్ధి పరిచేందుకు ఇరు మం డలాల అధికారులు పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించారు. శాశ్వత దిశగా ప్రణాళికలు కూడా రూపొందించారు. రూ.10 కోట్ల నిధులు అవసరమున్నట్టు అధికారులు లెక్కలు తీసి ఉన్నతాధికారుకు పంపించారు. మంచిర్యాల, కుమరం భీం జిల్లాలకు వ్యాపార రంగంతో పాటు, రవాణా వ్యవస్థ ఎంతో మెరుగు ఉండే అవకాశాలున్నప్పటికీ కూడా నిధులు రాక పనులు సాగడం లేదు. దీంతో రోడ్డు సౌకర్యం, వంతెన సౌకర్యం లేక పోవడంతో వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. అధికారులు, నాయకులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 10:28 PM