బీసీల హవా....
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:46 PM
మునిసిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి వెనుకబడ్డ కులస్థు లు(బీసీ) తమ సత్తా చాటారు. జనాభాలో అధిక భాగం ఉన్న ఆయా కులస్థులకు అదే స్థాయిలో వివిధ పార్టీలు టిక్కెట్లు కేటాయించగా, ఫలితాలు సైతం అదే ఒరవడి లో వచ్చాయి
-మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు వారివే
-జనరల్ స్థానాల్లోనూ సత్తా చాటిన బీసీలు
-కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలోనూ ఆధిపత్యం
మంచిర్యాల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి వెనుకబడ్డ కులస్థు లు(బీసీ) తమ సత్తా చాటారు. జనాభాలో అధిక భాగం ఉన్న ఆయా కులస్థులకు అదే స్థాయిలో వివిధ పార్టీలు టిక్కెట్లు కేటాయించగా, ఫలితాలు సైతం అదే ఒరవడి లో వచ్చాయి. రాష్ట్రంలో నెలకొన్న బీసీ రిజర్వేషన్ల అం శంపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడంతో రి జర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు ఆం క్షలతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అందుకు ప్రత్యామ్నాయంగా ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం వరకు బీసీలకు సీట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొన్నటి పంచాయ తీ ఎన్నికల్లో బీసీలకు సీట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పించగా, ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లోనూ సింహభాగం టికెట్లు బీసీలకే కేటాయించారు. ఈ మేర కు జనరల్ కేటగిరీ కింద కేటాయించిన మొత్తం నుంచి బీసీలకు అవకాశం కల్పించారు. దీంతో బీఆర్‌ఎస్, బీజే పీలు సైతం అదే దారిన నడవాల్సి వచ్చింది. ఆ రెండు పార్టీలు కూడా సగానికిపైగా సీట్లను ఆయా కులస్థులకు కేటాయించాయి.
రాజ్యాధికారానికి నాంది...
మునిసిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో అన్ని ప్ర ధాన పార్టీలు బీసీలకు పెద్దపీట వేయడం, ఫలితాల్లో నూ ఆయా కులస్థులు హవా కొనసాగించడంపట్ల స ర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీల నిర్ణ యం, వచ్చిన ఫలితాలు భవిష్యత్తులో బీసీలు రాజ్యాధి కారానికి నాందిగా భావిస్తున్నారు. చట్ట సభల్లో బీసీల ప్రాతినిథ్యం కోసం దశాబ్దాలుగా ఆ కులస్థులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అందు కోసం బీసీలు ప్రత్యేక కమిటీ లు ఏర్పాటు చేసి, కార్యాచరణ ప్రణాళికలు రూపొంది స్తున్నారు. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. వాటి ప రిధిలోని మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, చె న్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెపేట మునిసిపాలిటీల్లో ఎన్ని కలు జరిగాయి. ఆయా బల్దియాల పరిధిలో మొత్తం 149 వార్డులు ఉండగా, వాటిలో సగభాగానికిపైగా అన్ని పార్టీలు బీసీలకు టిక్కెట్లు కేటాయించాయి. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెన్నూరు, బెల్లంపల్లి షెడ్యూల్ కులాలకు కేటాయించగా, మంచిర్యాల జనర ల్‌కు రిజర్వ్ అవుతూ వస్తోంది. దీంతో మంచిర్యాల ని యోజకవర్గంలో అనాదిగా అగ్ర కులాలకు చెందిన వా రు పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్‌కు రిజర్వ్ కావడం తొలి విజయంగా భావిస్తుండగా, పీఠాన్ని మేయర్, డిప్యూటీ మేయర్ ఇరువురూ బీసీ కులస్థులు అధిరోహించడంతో శుభసూచకంగా అనుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఓటు బ్యాంకు కలిగిన బీసీల సంఖ్యకు అనుగుణంగా ఆయా పార్టీల ముఖ్య నేతలు కూడా జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్లు కేటా యించగా, వాటితోపాటు జనరల్ స్థానాల్లోనూ పెద్ద మొ త్తంలో గెలుపొందడం బీసీలకు మనో ధైర్యాన్ని కలిగిస్తుంది.
కార్పొరేషన్‌లో అధికంగా సీట్లు...
మునిసిపల్ ఎన్నికలను పురస్కరించుకొని మంచి ర్యాల కార్పొరేషన్‌లో పెద్ద మొత్తంలో బీసీలకు టికెట్లు దక్కాయి. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా, వాటిలో 41 స్థానాలను బీసీలకే కేటాయించడం గమనార్హం. దాదాపు 68 శాతం వరకు బీసీలకు సీట్లు ప్రధాన పార్టీలు సీట్లు కేటాయించాయి. సుప్రీం కోర్టు రూలింగ్ మేరకు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించగా, మిగతా సీట్లను జనరల్‌కు రిజర్వ్ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో ఎస్టీకి 1, ఎ స్సీకి 9, బీసీ 20, జనరల్ 30 స్థానాలను కేటాయిం చా రు. బీసీకి రిజర్వ్ చేసిన 20 స్థానాలతోపాటు జనరల్ విభాగంలో మరో 20 పై చిలుకు సీట్లు ఆయా కులస్థు లకు దక్కాయి. ఇందులో కాంగ్రెస్ 41 సీట్లు బీసీలకు కేటాయించగా, బీఆర్‌ఎస్ 43, బీజేపీ 42 స్థానాలను వెనుకబడ్డ కులస్థులకు కేటాయించాయి.
మునిసిపాలిటీల వారీగా బీసీ సీట్లు....
జిల్లాలోని మునిసిపాలిటీల వారీగా బీసీలకు కేటా యించిన సీట్ల సంఖ్య, గెలుపు వివరాలు ఇలా ఉన్నాయి
మునిసిపాలిటీ వార్డులు బీసీ రిజర్వేషన్ జనరల్ బీసీల విజయం
మంచిర్యాల 60 20 30 41
బెల్లంపల్లి 34 06 17 15
చెన్నూర్ 18 05 09 11
క్యాతన్‌పల్లి 22 03 11 12
లక్షెట్టిపేట 15 03 08 08