Share News

kumaram bheem asifabad- ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:30 PM

హియరింగ్‌ ఫ్రక్రియను పక్కాగా నిర్వహించాలని తహసీల్దార్‌ రహీమొద్దీన్‌ తెలిపారు. సిర్పూరు(టి)లో ఏర్పాటు చేసిన పలు పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసులు వచ్చిన వారికి హియరింగ్‌ ప్రక్రియలో సర్టిపికెట్లను పక్కాగా పరిశీలించాలని సూచించారు

kumaram bheem asifabad- ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి
పరిశీలిస్తున్న తహసీల్దార్‌ రహీమొద్దీన్‌

సిర్పురు(టి), సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): హియరింగ్‌ ఫ్రక్రియను పక్కాగా నిర్వహించాలని తహసీల్దార్‌ రహీమొద్దీన్‌ తెలిపారు. సిర్పూరు(టి)లో ఏర్పాటు చేసిన పలు పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసులు వచ్చిన వారికి హియరింగ్‌ ప్రక్రియలో సర్టిపికెట్లను పక్కాగా పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ఆద్వర్యంలో చేపడుతున్న సర్‌ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఇచ్చిన నోటీసులను తీసుకొని ఆన్‌లైన్‌లో త్వరగా నమోదు చేయాలని తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని ముంజంపల్లి, బారేగూడ, కుకుడ, బెజ్జూరు తదితర గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా బీఎల్‌వోలకు తగిన సూచనలు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన ఓటర్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట సీనియర్‌ అసిస్టెంట్‌ అచ్యుత్‌రావు, జీపీవో మారుతి తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:32 PM