ఆశల యాసంగి
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:10 PM
వానాకాలం పంట సీజన్‌లో అంతంత మాత్రపు దిగుబడులతో నష్ట పోయిన రైతులు యాసంగి పంటలపై ఆశలు పెంచుకు న్నారు. అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
-జిల్లాలో 1,27,639 ఎకరాల్లో పంటల సాగు
-1,18,437 ఎకరాల్లో వరి, 7,120 ఎకరాల్లో మక్క పంట
-విత్తన వరి వైపు రైతుల మొగ్గు
-అధిక దిగుబడులే లక్ష్యంగా ముందుకు..
నెన్నెల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : వానాకాలం పంట సీజన్‌లో అంతంత మాత్రపు దిగుబడులతో నష్ట పోయిన రైతులు యాసంగి పంటలపై ఆశలు పెంచుకు న్నారు. అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాకాలం చివరి వరకు వా నలు కురియడంతో జలాశయాలు కళకళలాడుతున్నా యి. చివరి ఆయకుట్టుకు సైతం సాగు నీటికి ఢోకా ఉం డదని రైతులంటున్నారు. జిల్లాలో మొత్తం సాగు 1,27,639 ఎకరాలు కాగా అందులో అదిక మొత్తంలో 1,18,437 ఎకరాల్లో వరి సాగవుతోంది. 7,120 ఎకరాల్లో మక్క పంట, మరో రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో కం ది, పెసర, జొన్న, మినుములు తదిరత పంటలు సాగ వుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడు వరి, మక్క పంటల విస్తీర్ణం పెరిగింది.
నష్టాల నుంచి గట్టెక్కేలా..
గత యాసంగి, వానాకాలం పంట సీజన్‌లలో వివిధ కారణాలతో అంతంత మాత్రంగానే పంటలు పండాయి. వానాకాలంలో అతివృష్టితో వరి పంట రోగాల బారిన పడి దిగుబడులు సగానికి తగ్గాయి. కొందరు రైతులకు పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. కౌలు రైతులు తీ వ్రంగా నష్టపోయారు. పండిన పంటకు ఽగిట్టుబాటు ధర కూడా దక్కలేదు. చీడపీడల ఉదృతితో పత్తి పంట తీ వ్రంగా దెబ్బతిన్నది. ఎకరానికి పది క్వింటాళ్ల పత్తి దిగు బడి రావాల్సి ఉండగా 6 నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అన్నదాతకు రెండు సీజన్లు చేదు అనుభవాలనే మిగిల్చగా.. గంపెడాశలతో ఈ యాసం గిలో పంటల సాగు చేస్తున్నారు.
-విత్తన వరిపై ఆసక్తి...
ఈ యాసంగిలో హైబ్రీడ్ విత్తన వరిసాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. సాధారణ వరితో పోల్చితే లాభాలు ఎక్కువగా వస్తుండటం వల్ల రెతులు ఆడమగ వరి సా గుపై మొగ్గు చూపించారు. ఈ యాసంగిలో నిరుటి కంటే సాగు విస్తీర్ణం రెట్టింపు అయింది. జిల్లాలో దాదా పు 15 వేల ఎకరాల్లో విత్తన వరి సాగవుతోంది. విత్తనో త్పత్తిలో భాగంగా ఆడమగ వరసలు వేసి సంకరీకరణ (క్రాసింగ్) చేసి విత్తనం పండిస్తారు. తగిన సస్యరక్షణ చర్యలు, సరైన సమయంలో క్రాసింగ్ చేస్తే ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల సంకర విత్తనాల దిగుబడి వస్తుం ది. ఆడరకం ధాన్యాన్ని ముందుగా ఒప్పందం ప్రకారం ప్రైవేటు కంపెనీలు నాన్యతను బట్టి క్వింటాలుకు రూ. 10వేల నుంచి రూ. 12వేల వరకు ఽచెల్లించి కొనుగోలు చే స్తాయి. మగ ఽవడ్లను సాధారణ దొడ్డు రకాలుగా మార్కె ట్లో అమ్ముకోవడంతో మరింత ఆదాయం వస్తుంది. సా ధారణ వరి సాగు కంటే విత్తన వరి సాగులో లాభాలు ఎక్కువగా ఉంటున్నాయని రైతులు చెప్పారు. కష్టానికి తగ్గ ఫలితం వస్తుందంటున్నారు.
జలాశయాలు కళకళ
జిల్లాలో ఈ వర్షకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ప్రాజెక్టులు, చెరువులు నీ ళ్లతో కళకళలాడుతున్నాయి. సాధారణంగా ప్రతి వర్షకా లంలో చెరువుల్లోని నీరు పంటల కోసం వదలడంతో న వంబరు మాసానికల్లా చెరువులు, కుంటలు అడుగంటి పోతాయి. కానీ ఈ సంవత్సరం పరిస్థితి అందుకు వి రుద్దంగా ఉంది. వర్షాకాలం ప్రారంభం నుంచి చెరువు ల్లోని నీరు చాలా తక్కువగా తీయడంతో సాగు నీటికి ఢోకా లేదని రైతులంటున్నారు.
గూడెం ఎత్తిపోతల ద్వారా 30వ డిస్ట్రిబ్యూటరీ కాలు వ వద్ద నీటిని వదులుతున్నారు. దండెపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని 30 వేల ఎకరాలకు యాసం గిలో నీరు అందిస్తామని అధికారులు ప్రకటించారు. ఎ ల్లంపల్లి జలాశయం నుంచి 90 రోజుల పాటు మొత్తం 2 టీఎంసీల నీటిని పంటలకు విడుదల చేయనున్నా రు. కడెం ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని జన్నారం, దండేప ల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాలకు సాగునీరం దుతున్నది. కడెం ప్రాజెక్టు పరిధిలో యాసంగిలో ఎడమ కాలువ ద్వార డీ-28 (దండెపల్లి) వరకు ఆరు వేల ఎక రాలు, అటు నుంచి చివరి ఆయకట్టు వరకు మరో నా లుగు వేల ఎకరాల పంట భూములకు అంటే మొత్తం పది వేల ఎకరాలకు సాగునిరు అందుతుంది. 0.5 టీఎం సీ నిలువ సామర్థ్యం కలిగిన భీమారం గొల్లవాగు ప్రాజె క్టు సైతం నిండా నీటితో ఉన్నాయి. భీమారం మండ లంలోని భీమారం, ఆరెపల్లి, అంకుశాపూర్, అర్కెపల్లి, మద్దికల్, కొత్తపల్లి, ఎల్కేశ్వరం, చెన్నూరు మండలం గంగారం, ఒత్కులపల్లి, కొమ్మెర గ్రామాల వరకు నీరు పారుతుంది. వ్యవసాయ బోర్లపైనే ఆధారపడే వారికి సై తం భూగర్బ జలాలు పుష్కలంగా ఉండటంతో సాగు నీటి మోటర్లు నిరంతరం నడుస్తున్నాయి.
యాసంగి సీజన్ ఆశాజనకంగా ఉంది
సురేఖ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
యాసంగి సీజన్ ఆశాజనకంగా ఉంది. సాగు నీటికి ఇబ్బంది లేక పోవడంతో ఈ సారి వరి నాట్లు జనవరి ఆఖరు వరకు సాగాయి. ముందుగా నాటుకున్న వరి పంట కలుపు దశలో ఉంది. సీజన్‌కు సరిపడ అన్ని ఎ రువులు అందుబాటులో ఉన్నాయి. శుక్రవారమే 800 ట న్నుల యూరియా ర్యాక్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. దాన్ని జిల్లాలోని డీలర్లకు పంపుతున్నాం. ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న వారికి డీల ర్లు వెంటనే బస్తాలు అందజేస్తున్నారు. ఏవోలు, ఏఈ వోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటలను పరిశీలించి రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనాలు ఇస్తున్నారు.