Share News

వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:57 PM

వినాయక నిమజ్జనాన్ని ప్రశాం తంగా నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్‌ కమీషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి సంబంధించి భద్రత ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

మంచిర్యాలక్రైం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : వినాయక నిమజ్జనాన్ని ప్రశాం తంగా నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్‌ కమీషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి సంబంధించి భద్రత ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అ న్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలన్నారు. నిమజ్జన ప్రదేశాలు, శోబాయాత్ర మార్గాలు, రద్దీ ప్రాంతాలు, పార్కింగ్‌ ప్రదేశాలను ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణ, రద్దీ నిర్వహణ, బందోబస్తు, ఇతర సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు శ్రీనివాస్‌, లలిత్‌కుమార్‌, నాగేంద్రగౌడ్‌, రమేష్‌, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, కృష్ణకుమార్‌, ప్రసాద్‌రావు, నవీన్‌కుమార్‌, భూమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫరామగుండం పోలీస్‌ కమీషనరేట్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలీంచి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:57 PM