Share News

గ్రామ దేవతలు మా వెంటే

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:08 AM

‘ మేము గ్రామానికి దూరమైనా నిత్యం మా వెంట ఉంటూ మమ్ములను గ్రామ దేవతలు కాపాడుతున్నాయి’ అని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని నర్సిరెడ్డిగూడెం ముంపు గ్రామ బాధితులు అన్నారు.

గ్రామ దేవతలు మా వెంటే
గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్థులు

ముత్యాలమ్మ మారెమ్మ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించిన ముంపు గ్రామస్థులు

మర్రిగూడ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘ మేము గ్రామానికి దూరమైనా నిత్యం మా వెంట ఉంటూ మమ్ములను గ్రామ దేవతలు కాపాడుతున్నాయి’ అని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని నర్సిరెడ్డిగూడెం ముంపు గ్రామ బాధితులు అన్నారు. గ్రామ దేవతలైన ముత్యాలమ్మ, ఈదమ్మ అమ్మవారికి నిర్మించిన నూతన దేవాలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి మూడు రోజుల నుంచి వేడుకలు నిర్వహిస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌ నిర్మాణంలో పూర్తిగా ముంపునకు గురైంది. గ్రామ ప్రజలు కలసి ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు వేడుకలను నిర్వహించుకుంటారు. చర్లగూడెం రిజర్వాయర్‌లో నర్సిరెడ్డి గూడెం గ్రామం పూర్తిగా ముంపు గురైన గ్రామ ప్రజల ఉండడానికి నీడ నిలువ లేక కుటుంబ పోషణ కోసం బతుకుదేరువు కోసం కొంతమంది బాధితులు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో నర్సిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు దూరమైన తమను చల్లగా చూసే మన గ్రామ దేవతలు వెంటే ఉండాలంటూ గ్రామస్తులందరూ కలిసి డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌కు సంబంధించిన పైలాన్‌ వద్ద నాటి సీఎం కేసీఆర్‌ 2017 జూన్‌ 12వ తేదీన శంకుస్థాపన చేశారు. పక్కనే ఉన్న పైలాన్‌ వద్ద ముంపు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్థులు అధికారుల ఆదేశాల మేరకు అమ్మవార్లకు దేవాలయం నిర్మించుకున్నారు. ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడేన్ని ఖాళీ చేసి ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కొందరు శివన్నగూడ గ్రామ సమీపంలో ఇళ్లను నిర్మించుకున్నారు. ముంపు గురవుతున్న విగ్రహాలను తీసుకొచ్చి ప్రజల సహకారంతో ముత్యాలమ్మ ఆలయాన్ని శివన్నగూడ పైలాన్‌ వద్ద ఏర్పాటు చేసుకొని అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్ఠాపన సందర్భంగా పురోహితులు, అర్చకులు కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాపోలు యాదగిరి పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:08 AM