Share News

వ్యాలిడేషన్‌ యాక్టు 2025ను వెనక్కి తీసుకోవాలి

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:23 PM

పార్లమెంటులో ఆమోదిం చిన పెన్షనర్స్‌ వ్యాలిడేషన్‌ యాక్టు-2025ను వెం టనే వెనక్కి తీసుకోవాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీధర్‌ డిమాండ్‌ చేశా రు.

వ్యాలిడేషన్‌ యాక్టు 2025ను వెనక్కి తీసుకోవాలి
అదనపు కలెక్టర్‌ అమరేందర్‌కు వినతిపత్రం అందజేస్తున్న విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు

- విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీధర్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/అచ్చంపేటటౌన్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంటులో ఆమోదిం చిన పెన్షనర్స్‌ వ్యాలిడేషన్‌ యాక్టు-2025ను వెం టనే వెనక్కి తీసుకోవాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీధర్‌ డిమాండ్‌ చేశా రు. బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆ ధ్వర్యంలో కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ అమరేం దర్‌కు వినతిపత్రం అందజేశారు. శ్రీధర్‌ మాట్లా డుతూ పెన్షనర్స్‌ వ్యాలిడేషన్‌ యాక్టు 2025 ప్ర కారం 2025 జనవరి 1 ముందు పదవీవిరమ ణ పొందిన వారు, ఆ తర్వాత పొందిన పెన్షనర్ల ను రెండు సమూహాలుగా విభజించడం వల్ల అంతకు ముందు పదవీవిరమణ పొందిన వారి కి రాబోయే వేతన సంఘం సిఫారసులు వర్తిం చవని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షనర్ల పాలి ట శాపంగామారిన పెన్షనర్స్‌ వ్యాలిడేషన్‌యాక్టు-2025ని వెంటనే రద్దు చేసి అందరికి సమాన వేతన సంఘం సిఫారసులను వర్తింప జేయా లని ఆయన కోరారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు సుధాకర్‌రెడ్డి, వెంకటశెట్టి, యుగంధర్‌రెడ్డి, వార్డెన్‌ చెన్నయ్య, నరసయ్య, శ్రీనివాసులు, పాండు, రాములు, వెంకటరాజు పాల్గొన్నారు.

అచ్చంపేటలోనూ పెన్షనర్లను నష్టపరిచే ఆల్‌ ఇండియా స్టేట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ వ్యాలిడేషన్‌ యాక్ట్‌-202ను వెనక్కి తీసుకోవాలని అచ్చంపేట డివిజన్‌ విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసి యేట్‌ అధ్యక్షుడు మంతటి నారాయణ ఆధ్వర్యం లో తహసీల్దార్‌ కార్యాలయం ముందు విశాంత్ర ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. త హసీల్దార్‌ సైదులుకు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో నాయకులు అశోక్‌, ప్రసాద్‌, శంకర్‌, జంగిరెడ్డి, రామస్వామి, జగాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రాములు, జైపాల్‌రెడ్డి, ప్రభాకర్‌, కుమారస్వామి, సాయికుమార్‌, సత్యనారా య ణ, వెంకట్‌రెడ్డి, చెన్నయ్య, వీరబ్రహ్మ, ఆనందం, బురాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 11:23 PM