Share News

నిబంధనలకు అనుగుణంగా చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:20 PM

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలని డీఎంహెచ్‌వో నరేం దర్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాల యంలో శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ చిన్న పిల్లల వైద్య నిపుణులు, చర్మ సంబంధిత వ్యాధి నిపు ణులతో వ్యాక్సినేషన్‌ టీకా ద్వారా వ్యాధుల నయం సం బంధిత వ్యాధులపై సమావేశం నిర్వహించారు.

నిబంధనలకు అనుగుణంగా చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలి

డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలని డీఎంహెచ్‌వో నరేం దర్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాల యంలో శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ చిన్న పిల్లల వైద్య నిపుణులు, చర్మ సంబంధిత వ్యాధి నిపు ణులతో వ్యాక్సినేషన్‌ టీకా ద్వారా వ్యాధుల నయం సం బంధిత వ్యాధులపై సమావేశం నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ జిల్లాలో 11 చర్మ సంబంధిత వైద్య నిపుణులు, 22 చిన్న పిల్లల వైద్య నిపుణులు ఆసుపత్రు లు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌లో నమోదై ఉన్నా యన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ప్రాక్టిషనర్లు వ్యాక్సిన్‌ ప్రి వెంటేబుల్‌ డీసీజ్‌లో సర్వేయలైన్స్‌లో పాల్గొనాలని, యా క్టివ్‌ సర్వేయలైన్స్‌ ప్రభుత్వ పరంగా ప్యాసివ్‌ సర్వేంట్స్‌ ప్రైవేటు పరంగా ఆచరించాలన్నారు. జిల్లా సర్వేయ లైన్స్‌ అధికారి ప్రైవేటు ఆసుపత్రులను సందర్శిస్తూ వివరాలను సేకరించాలని, ముఖ్యంగా చిన్న పిల్లలు, చ ర్మ సంబంధిత వ్యాధి నిపుణుల ఆసుపత్రులను సంద ర్శించాలన్నారు. ఆసుపత్రులు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ ప్రకారం అన్ని రకాల సర్టిఫికెట్లను అందుబాటులో ఉం చుకోవాలని, ముఖ్యంగా ఫైర్‌ బయో వేస్టేజ్‌ రిజిస్ర్టేష న్‌ సర్టిఫికెట్‌ వైద్యుల వివరాలను వైద్యసేవలకు తీసు కుంటున్న చార్జిల వివరాలను ఆసుపత్రుల్లో అందరికి కనిపించేలా ఉంచాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్‌, డీపీవో ప్రశాంతి, డీపీఎం ప్రవళిక, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:20 PM