kumaram bheem asifabad-కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:49 PM
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేవారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ అరెస్టు, విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు కళ్లకు నల్లరిబ్బన్లు ధరించి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేవారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ అరెస్టు, విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు కళ్లకు నల్లరిబ్బన్లు ధరించి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గాంధీచౌక్ నుంచి అంబేద్కర్‌చౌక్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు విక్రయించి విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడారని ఆరోపించారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, మాజీ ఎంపీపీ బాలేశ్వ ర్‌గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు తారీఖ్, కాంగ్రెస్ అనుబంధ సంఘల నాయకులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీని అరెస్టును నిరసిస్తూ కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అధి నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయటం దారుణమన్నారు. నీట్ వ్యవహారంలో వెంటనే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ షాహిన్ సుల్తాన, పట్టణ అధ్యక్షుడు అల్లాడి రాజు తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెనలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగణ మాట్లాడుతూ ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం దారుణంగా పోలీసులతో కొట్టించినట్టు తెలిపారు. నీట్ విషయంలో వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేసరి కిషన్ గౌడ్ తదిదతరులు పాల్గొన్నారు.