కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
ABN , Publish Date - May 14 , 2026 | 11:35 PM
కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్లే నీట్ పేపర్ లీక్ అయి, పరీక్ష రద్దయి పేద విద్యార్థులకు తీవ్ర అ న్యాయం జరిగిందని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు రామావత్ సంతోష్ విమర్శించారు.
- ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సంతోష్
అచ్చంపేట/ మన్ననూరు, మే 14 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్లే నీట్ పేపర్ లీక్ అయి, పరీక్ష రద్దయి పేద విద్యార్థులకు తీవ్ర అ న్యాయం జరిగిందని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు రామావత్ సంతోష్ విమర్శించారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మన్ననూరు గ్రా మంలో కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్డు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షిం చాలని, నీట్ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్‌టీఏ సంస్థ ను రద్దు చేయాలని, భవిష్యత్‌లో ఇలాంటి పేపర్ లీకులు జరగకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌యస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ నల్ల వెల్లి యశ్వంత్, జనరల్ సెక్రెటరీ దాసరి కార్తీక్, కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షుడు ఎంఏ రహీం, గ్రామ సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ రమ ణగౌడ్, కాంగ్రెస్ నాయకులు పెర్ముల వెంకటే శ్వర్లు, కృష్ణయ్య, సంభు వెంకట్‌రమణ, బాల స్వామి, రమేష్, షకీల్, శంకర్, నిరంజన్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.