kumaram bheem asifabad- ట్రూ అప్ బాదుడు
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:10 PM
విద్యుత్ వినియోగదారులపై కరెంటు చార్జీల అదనపు భారం పడనుంది. ఇప్పటికే ఎల్‌నినో కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై విద్యుత్ శాఖ ట్రూ-అప్ చార్జీల పేరిట మరింత ఆర్థిక భారం మోపేందుకు సిద్ధమైంది.
- ఈ నెలలో యూనిట్‌కు 30పైసలు, వచ్చే నెల నుంచి 50పైసలు
- గృహజ్యోతి, వ్యవసాయ కనెక్షన్లకు మినహాయింపు
బెజ్జూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారులపై కరెంటు చార్జీల అదనపు భారం పడనుంది. ఇప్పటికే ఎల్‌నినో కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై విద్యుత్ శాఖ ట్రూ-అప్ చార్జీల పేరిట మరింత ఆర్థిక భారం మోపేందుకు సిద్ధమైంది. ఈ నెల నుంచి యూనిట్‌పై 30పైసలు, డిసెంబరు నుంచి యూనిట్‌కు 50పైసలు అదనం గా వసూలు చేయనుండడంతో విద్యుత్ వాడకంలో జాగ్రత్త వహించకుంటే ఇకపై అదనంగా వందల రూపాయలు కరెంట్ బిల్లు పెరగనుంది. ట్రూ-అప్ చార్జీలలో గృహజ్యోతి, వ్యవసాయ విద్యుత్ కనెక్ష న్లకు మినహాయింపులు ఇచ్చారు.
- జిల్లా పరిధిలో..
జిల్లా పరిధిలోని 15మండలాల్లో కేటగిరీ-1(డొమె స్టిక్) 1,43,844కనెక్షన్లు, కేటగిరి-2(నాన్ డొమెస్టిక్) 15,548, పరిశ్రమలు 644, కుటీర పరిశ్రమలు 41, వ్యవసాయం 16,024, వాటర్ వర్క్, వీధి దీపాలు 3030, ఇతరులు 2,273 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 70వేలకు పైగా గృహజ్యోతి పథకం వినియోగించు కుంటున్నారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం అధికమైంది. అధికమైన వేడితో ప్యాన్లు, ఏసీలు, కూలర్లు నిరంతరాయంగా వాడుతుండ డంతో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. దీంతో నెలకు 200యూనిట్లకు పైగా బిల్లు అందుకునే వారిపై వందల్లో అదనపు భారం పడనుండగా వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్తు కనెక్షన్లపై వేల రూపాయలు భారం పడనుంది.
- విద్యుత్ డిస్కింలు..
విద్యుత్ డిస్కింలు కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేస్తాయి. కొనుగోలు వ్యయం కంటే పంపిణీ, సఫరా వ్యయం అనుకున్న దానికంటే ఎక్కువైనప్పు డు ఆ వ్యత్యాసం మొత్తాన్ని నియంత్రణ మండలి అనుమతితో ట్రూ-అప్ చార్జీల పేరిట వినియోగదా రుల నుంచి వసూలు చేస్తాయి. దీనిలో భాగంగా నవంబరు నుంచి విధించనున్న ట్రూ-అప్ చార్జీల ను డిస్కింలు 28నెలల పాటు వసూలు చేసుకునేం దుకు అనుమతివ్వగా, ఈ చార్జీలను బిల్లులో ప్రత్యేకంగా ముద్రించనున్నారు. ఈ క్రమంలో 2028 డిసెంబరు నెల వరకు విద్యుత్ వినియోగదారులు అదనపు భారం మోయాల్సి వస్తోంది.
- ఎల్‌నినో కారణంగా..
ఎల్‌నినో కారణంగా సరైన వర్షాలు లేక పంటల దిగుబడి అమాంతం తగ్గిపోవడంతో నిత్యావసరాల ధరలు, బియ్యం, కూరగాయలు, వంటనూనెల ధరలు ఇప్పటికే ఆకాశన్నంటి సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ట్రూ-అప్ చార్జీలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో విద్యుత్ వాడకం భారంగా మారుతోందని సామా న్య, పేద ప్రజలు వాపోతున్నారు. గృహజ్యోతి, వ్యవసాయ కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చి మిగితా కనెక్షన్లకు చార్జీలు విధించడం వల్ల పేదలకు భారంగా మారనుంది. వర్షాలు లేక ఉక్కపోతతో విద్యుత్ వినియోగం కూడా అమాంతం పెరిగింది. దీంతో యూనిట్ల వాడకం కూడా పెరుగుతోంది. దీంతో 200యూనిట్లకు పైగా వచ్చే అవకాశం ఉండ డంతో ట్రూ-అప్ చార్జీల వాత తప్పేలా లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ ట్రూ-అప్ చార్జీల భారం నుంచి తప్పించాలని విని యోగదారులు కోరుతున్నారు.