kumaram bheem asifabad- వన్యప్రాణుల దాహార్తి తీరుతోంది..
ABN , Publish Date - Feb 19 , 2026 | 10:52 PM
వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖాధికారులు ముందస్తుగానే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏటా వేసవికాలంలో జిల్లాలోని ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవతున్నా యి. ఎండల తీవ్రతకు అటవీప్రాంతాల్లో కుంటలు, చెలిమెలు, వాగులు, ఎండిపోవడంతో వన్యప్రా ణులకు నీటి ఎద్దడి నెలకొంటుంది.
- అటవీ ప్రాంతంలో చెక్‌డ్యాంలు, నీటి కుంటల ఏర్పాటు
- సీసీ కెమెరాలతో జంతువుల కదలికలు నమోదు
పెంచికలపేట, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖాధికారులు ముందస్తుగానే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏటా వేసవికాలంలో జిల్లాలోని ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవతున్నా యి. ఎండల తీవ్రతకు అటవీప్రాంతాల్లో కుంటలు, చెలిమెలు, వాగులు, ఎండిపోవడంతో వన్యప్రా ణులకు నీటి ఎద్దడి నెలకొంటుంది. దీంతో దాహా ర్తిని తీర్చుకునేందుకు వన్యప్రాణులు సమీప గ్రామాలకు, మైదాన ప్రాంతాలకు వెళ్లి మృత్యు వాత పడుతున్నాయి. దీన్ని నివారిం చేందుకు అటవీ జంతువుల దాహం తీర్చేందుకు గత కొన్ని ఏళ్లుగా అటవీ శాఖ అధికారులు సాసర్‌ఫీట్లు, చెక్ డ్యాంలు, నీటి కుంటలు నిర్మిస్తున్నారు. సాసర్ ఫీట్లలో ట్రాక్టర్ సహాయంతో ట్యాంకర్లతో మూడు రోజులకోసారి నీటిని నింపుతున్నారు. వీటితో పాటు పంపు సెట్ల ద్వారా వన్యప్రాణులకు దాహార్తిని తీరుస్తున్నారు.
- మృత్యువాత పడకుండా..
ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాంలో సంచ రిస్తున్న జంతువులు మృత్యువాత పడకుండా అధికా రులు చర్యలు తీసుకుంటున్నారు. విస్తీర్ణం మొత్తం 6,01,831 ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతం ఎన్నో రకాల వృక్ష, జంతు, జీవరాశులకు ఆవాలం, జింకలు, దుప్పులు, పెద్దపులులు, చిరుత పులులు, చుక్కల దుప్పులు, కోతులు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, హైనాలు, అడవిపందులు, నక్కలు, తోడేళ్లు, అటవీ కుక్కలు తదితర జంతువులు వేల సంఖ్యలో జీవిస్తున్నాయి. ఇవి నీటి కుంటలు, చెక్ డ్యాంలు, సాసర్ ఫీట్ల వద్దకు అటవీ జంతువులు రాత్రి వేళ వచ్చి దాహం తీర్చుకుంటాయి. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో వాటి వద్దకు చేరుకొని దాహార్తిని తీర్చుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నీటి వసతులు కల్పించిన ప్రాంతాల్లో వేటగాళ్లు ఉచ్చులకు అటవీ జంతువులు బలికాకుం డా దృష్టి సారిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బేస్ క్యాంపుల వద్ద అటవీ సిబ్బందితో వేటగాళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటిక ప్పుడు పర్యవేక్షణ చేసేలా ప్రణాళికలను రూపొం దించారు. వేటగాళ్లను కట్టడి చేయడంలో కూడా ట్రాప్ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నా యని చెబుతున్నారు.
వివరాలు ఇలా..
అటవీ విస్తీర్ణం : 6,01,831
జంతు జాతులు : 350
డివిజన్లు : ఆసిఫాబాద్, కాగజ్‌నగర్
రేంజ్‌లు : 12
సాసర్ ఫీట్లు : 300
నీటి కుంటలు : 650
చెక్ డ్యాంలు : 150
సోలార్ పంపు సెట్లు : 22
నీటి సమస్య తలెత్తకుండా చర్యలు..
- అనిల్‌కుమార్, ఎఫ్‌ఆర్వో
అటవీ జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. జంతువులు అధికంగా సంచ రించే ప్రాంతాల్లో సాసర్ ఫీట్లు, నీటి కుంటలు, చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి నిత్యం నీరు అందు బాటులో ఉండేలా చర్యలు తీసుకుంటు న్నాం. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అటవీ జంతువుల దాహం తీర్చేందుకు నీటి కొరత లేకుం డా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వీటితో పాటు సిబ్బందితో కలిసి నిరంతరం పర్యవే క్షిస్తున్నాం. వన్యప్రాణులకు హాని తలపె ట్టినా, వేటాడినా కఠిన చర్యలు తీసుకుంటాం.