Share News

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు ‘ది థర్డ్‌’ ఎంపిక

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:20 AM

సీనియర్‌ జర్నలిస్టు, రచయిత కేఏ మునిసురేశ్‌ పిళ్లె దర్శకత్వం వహించిన ‘ది థర్డ్‌’ లఘుచిత్రం 16వ దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు ‘ది థర్డ్‌’ ఎంపిక

  • ఢిల్లీలో దాదాసాహెబ్‌ జయంతి సందర్భంగా ఈ చిత్ర ప్రదర్శన

సీనియర్‌ జర్నలిస్టు, రచయిత కేఏ మునిసురేశ్‌ పిళ్లె దర్శకత్వం వహించిన ‘ది థర్డ్‌’ లఘుచిత్రం 16వ దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్‌ జయంతి సందర్భంగా ఈనెల 30న ఢిల్లీలో ఈ లఘుచిత్రం ప్రదర్శితమవుతుందని శనివారం ఓ ప్రకటనలో దర్శకుడు మునిసురేశ్‌ పేర్కొన్నారు. ప్రకృతిలో ప్రతి చర్యకు సమానమైన, వ్యతిరేక చర్య ఉంటుందన్న (న్యూటన్‌ మూడో గమన నియమం) సూత్రాన్ని ప్రతి విషయానికి ఆపాదించి.. విద్యార్థులను హింసించే ఓ భౌతికశాస్త్ర అధ్యాపకుడికి ఎదురైన ప్రతిచర్య ఏమిటన్న కథ ఆధారంగా ‘ది థర్డ్‌’ రూపొందించినట్లు దర్శకుడు చెప్పారు.

Updated Date - Apr 26 , 2026 | 04:20 AM