Share News

సర్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:08 PM

ఎన్నికల సంఘం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రి యను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పి. చం ద్రయ్య సూచించారు.

సర్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

-అదనపు కలెక్టర్‌ పి. చంద్రయ్య

నెన్నెల, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సంఘం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రి యను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పి. చం ద్రయ్య సూచించారు. ఆదివారం మండలంలోని ఘన్‌పూర్‌, జో గాపూర్‌ గ్రామాల్లో ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫామ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఫారా లు అందజేయాలన్నారు. నిబంధనలకు అనుగునంగా దృవీక రి స్తూ పారదర్శకంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఎల్‌వోల కు సూచించారు. ఇంటింటికి ఫామ్‌లు అందాయా.. లేదా అని అడిగి తెలసుకున్నారు. ఘన్‌పూర్‌లో పిల్లకు చుక్కల మందు వేసి పల్స్‌పోలీయో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతనంగా నిర్మిస్తున్న పంచాయతి, వీవో భవనాల నిర్మాణం పనులను ప రిశీలించారు. నిర్మాణం పనులు సత్వరం పూర్తి చేసి ఉపయో గంలోకి తేవాలన్నారు. జోగాపూర్‌లో పంచాయతి, వీవో భవనా ల నిర్మాణం కోసం స్థలం సేకరించి అప్పగించాలని తహసీల్దార్‌ ను ఆదేశించారు. జోగాపూర్‌ మత్తడివాగు ప్రాజెక్టును సందర్శిం చారు. నీటి సామర్థ్యం, ఆయకట్టు వివరాలు, పంటల సాగు గూర్చి రైతులను అడిగి తెలుసుకున్నారు. అంతకంటే ముందు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. సిబ్బంది హా జరు, మందుల స్టాక్‌, పేషెంట్లకు అందుతున్న వైద్యం గూర్చి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌ను అడిగి తెలసుకున్నారు. వా నాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తగా ఉండాలని సూచించారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో మహమ్మద్‌ అ బ్దుల్‌ హై, ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీవో నరేష్‌, ఘన్‌పూర్‌, జోగా పూర్‌ సర్పంచులు గన్న సతీష్‌, దుర్గం శీవ్రిద్య ఉన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 11:08 PM