Share News

kumaram bheem asifabad- ఎండలు బాబోయ్‌

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:02 PM

జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగడంతో ఉక్క పోతతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం పది గంటలు దాటితే ఎండ తీవ్రత అధికంగానే ఉంటోంది. మధ్యాహ్న సమయంలో బయట తిరగాలంటే ప్రజలు జంకుతున్నారు.

kumaram bheem asifabad-  ఎండలు బాబోయ్‌
మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారిన జైనూర్‌-ఆసిఫాబాద్‌ రహదారి

- ఉక్కపోతతో ప్రజల అవస్థలు

- అడుగంటుతున్న జలాశయాలు..ఎండుతున్న పంటలు

- జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన

చింతలమానేపల్లి/జైనూర్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగడంతో ఉక్క పోతతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం పది గంటలు దాటితే ఎండ తీవ్రత అధికంగానే ఉంటోంది. మధ్యాహ్న సమయంలో బయట తిరగాలంటే ప్రజలు జంకుతున్నారు. మార్చి మెదటి వారం నుండి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చిలోనే ఈ విధంగా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో ఏ విధంగా ఉంటాయోనని భయపడుతున్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటి మట్టం తగ్గుతోంది. పంటలకు సాగు నీరందకు ఎండి పోయే దశకు చేరుకున్నాయి. ఆదేవిధంగా భూగర్భ జలాలు పడిపోవడంతో రానున్న రోజుల్లో గ్రామాల్లో తీవ్ర తాగు నీటి ఇబ్బందులు ఎదురవనున్నాయి.

- పగటి ఉష్ణోగ్రతల్లో..

మార్చి ప్రారంభం కావడంతో పగటి ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మార్చి ప్రారంభం నుంచి ఎండల తీవ్రత ఎక్కువైంది. ప్రస్తుతం జిల్లాలో గురువారం మధ్యాహ్నం 38.3 డిగ్రీల ఉష్ణోగత నమోదు కాగా కనిష్టంగా 18.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత ఉంటుందని సంబంఽ దిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మూడు కాలాలు అధికంగానే ప్రభావాన్ని చూపుతాయి. వేసవి ప్రారంభం కావడంతో ముదురుతున్న ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు ముగించుకొని మధ్యాహ్నం వేళల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు వేగంగా నమోదు పెరిగి పోవడంతో ఎండల తీవ్రత పెరుగుతోంది. గతేడాది సైతం వేసవిలో అత్యధికంగా 45 డిగ్రీ ల పైనే ఉష్ణోగత లు నమోదైన దాఖలాలున్నాయి. మార్చిలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతే రాబో యే ఏప్రిల్‌, మే మాసాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని జనం బెంబేలెత్తిపోతున్నారు.

- మొదలైన సీజన్‌ సందడి..

వేసవి సీజన్‌ ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాపారాలు మరింతగా ఊపందుకుంటు న్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్‌, పలు మండల కేంద్రాల్లో దాతలు చలి వేంద్రాలు, శీతల పానీయాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కూలర్‌ల తయారీలో వ్యాపారులు బిజీబిజీగా మారిపోయారు. ఏటా వేసవి సీజన్‌లలో కొందరు కూలర్లు, ఏసీలు, రంజన్లు, ఫ్రిజ్‌ల కొనుగోలు చేయడం, కొందరు మరమ్మతులు చేపట్టి వాడుకుంటున్నారు. దానికి తోడు సీజన్‌లో ధరల మరింత పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఇళ్లపై కప్పులు, ఇంటి ముందు చల్లని పందిర్లు ఏర్పాటు చేసుకొని వేసవి కాలంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే వేవివి తీవ్రత దృష్ట్యా కూరగాయల దిగుబడులు, ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అిాగే వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు సీజనల్‌ వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా..

తేదీ గరిష్ఠం కనిష్ఠం

మార్చి 8 37.2 17.6

మార్చి 9 37.6 17.5

మార్చి 10 37.9 17.8

మార్చి 11 38.0 18.0

మార్చి 12 38.2 18.2

మార్చి 13 38.4 18.3

మార్చి 14 38.6 18.4

Updated Date - Mar 14 , 2026 | 11:02 PM