kumaram bheem asifabad- నీటికోసం రైతుల పాట్లు
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:41 PM
ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడు తున్నారు. కుమరం భీం ఆసిపాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తుం టారు. నీటి వనరులు సక్రమంగా లేకపోవడంతో కఏవలం వర్షాధారంగా ఎక్కువ సాగుచేస్తుంటారు. ఎల్నినో ప్రభావంతో కరువు ఛాయలు అలుముకోవడంతో అన్నదాతలకు అవస్థ లు తప్పడం లేదు.
- పంటలకు కాపాడుకునేందుకు అన్నదాతల భగీరథ ప్రయత్నం
వాంకిడి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడు తున్నారు. కుమరం భీం ఆసిపాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తుం టారు. నీటి వనరులు సక్రమంగా లేకపోవడంతో కఏవలం వర్షాధారంగా ఎక్కువ సాగుచేస్తుంటారు. ఎల్నినో ప్రభావంతో కరువు ఛాయలు అలుముకోవడంతో అన్నదాతలకు అవస్థ లు తప్పడం లేదు. అనుకున్న సమయానికి వర్షాలు పడక ప్రస్తుతం సాగవుతున్న పంటల రక్షణకు ఆపసోపాలు పడుతున్నారు. సకాలంలో వర్షాలు కురువక పంటలు ఎండిపోయే దశకు వచ్చాయి. కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి రైతన్నలు ఆవేదనకు గురవుతున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను వాడుకుంటూ కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆర్థిక స్థోమత, బోరుబావులు వంటి నీటి వనరులు ఉన్న వారు ఎలాగోలా ఆయిల్ ఇంజెన్లు, మోటార్లతో పంటలకు తడులు ఇచ్చుకుంటూ నెట్టుకొస్తు న్నారు. ఎలాంటి వనరులు లేని పలువురు రైతులు ఎండిపోతున్న పంటలను బతికించేకునేందుకు నిత్యం శ్రమిస్తు న్నారు. అయిల్ ఇంజన్లు కొనుగోలు చేసి, కొంత మం ది రైతులు ఇంజన్లను ఆద్దెకు తీసుకువచ్చి సమీపం లోని కుంటలు, కాలువాల్లో ఉన్న నీటిని డీజిల్ ఇంజన్లతో ఎండిపోతున్న పంటలకు తడులు ఇస్తున్నా రు. ఎండల తీవ్రతకు పంటలు దెబ్బతి నకుండా రాత్రింబ వళ్లు చేన్లలో ఉంటూ అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టిన పెట్టుబడులు రాకా అప్పుల ఊబిలోకి వెళ్తా మని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- జిల్లాలో ప్రధానంగా..
జిల్లాలో ప్రధానంగా రైతులు 3,77, 764 ఎరాల్లో పత్తి పంట సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పత్తి పంట పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రారం భంలో వర్షాలు లేక రైతులు విత్తనాలను రెండేసి సార్లు విత్తుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎదుగుదల లోపించింది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 5-6 క్వింటాళ్లు దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టినా.. కనీసం ఖర్చులు కూడా చేతికి వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, దీర్ణకాలిక వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండి పోయి దిగుబడులు ధారుణంగా పడిపోయే ప్రమా దం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ఆయిల్ ఇంజెన్లు, పైపుల సాయంతో అదనపు ఖర్చులు భరిస్తూ పత్తి పంటకు నీటి తడులు ఇస్తున్నా వాటిని ఎంతవ రకు దక్కించుకోగలమో తెలియని నిస్పహా య స్థితిలో రైతులు కొట్టుమిట్టాతున్నారు. వానాకాలం లో జూలై చివర, ఆగస్టు మొదటి వారంలో కొద్ద మేర వర్షాలు కురవడంతో.. జలవనరుల్లో నీరు చేరింది. తరువాత వానలు ముఖం చాటేయడం, వాతావర ణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు పెరగడంతో.. భూగర్భ నెమ్మదిగా జలాలు పడిపోతున్నాయి. ఎండల కారణంగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్నగర్ రెండు డివిజన్లలో వంద ఎకరాలలోపు, అంతకు మించి సాగునీటి ఆయకట్టు కలిగిన చెరువులు 516 ఉన్నాయి. జూలైలో ఉన్న నీటి నిల్వ పరిస్థితి అక్టోబరు వచ్చేసరికి చాలా చెరువుల్లో తగ్గిపోయింది. గతేడాది అక్టోబరులో ఆసిఫాబాద్ డివిజన్లోని తొమ్మిది, కాగజ్నగర్ డివిజన్లోని 131 చెరువుల్లో సర్ ప్లస్ (మత్తడి దూకే స్థాయి) నీరు ఉండగా.. ఈసారి ఒక్క దానిలోనూ ఆ పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు.