Share News

kumaram bheem asifabad- పచ్చిరొట్టతో పైరుకు బలం

ABN , Publish Date - May 29 , 2026 | 10:38 PM

పచ్చిరొట్ట పంట దిగుబడిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. భూసారం పెంపులో దిట్ట. భూముల్లో రేగటి మట్టి పోసేకంటే నేల స్వభావానికి అనుగుణం గా పచ్చి రొట్ట ఎరువు సాయంతో సారవంతంగా మా ర్చుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

kumaram bheem asifabad- పచ్చిరొట్టతో పైరుకు బలం
లోగో

- రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుదల

- రైతులకు రసాయన ఎరువుల ఖర్చులు ఆదా

- 50శాతం సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాల పంపిణీ

పచ్చిరొట్ట పంట దిగుబడిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. భూసారం పెంపులో దిట్ట. భూముల్లో రేగటి మట్టి పోసేకంటే నేల స్వభావానికి అనుగుణం గా పచ్చి రొట్ట ఎరువు సాయంతో సారవంతంగా మా ర్చుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

బెజ్జూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పం టల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. మెరుగైన దిగుబడులు సాధించాలనే ఆరాటంతో రైతు లు రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతు న్నారు. ఆధునిక వ్యవసాయంలో ఇవి తాత్కా లికంగా లాభాలను తెచ్చిపెడుతున్నట్లు అనిపించినా దీర్ఘకా లంలో భూమికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయంలో రైతులకు లాభాలు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నా భూమికి తీరని న ష్టం వాటిల్లుతోంది. ఇందుకు ప్రత్యామ్నా యంగా సహజమైన పచ్చిరొట్ట ఎరువులు సాగులో వాడడం ద్వారా భూసారాన్ని పెంపొందించు కోవడమే కాకుం డా తమ పెట్టుబడులు తగ్గించుకునే వీలుంటుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

- రసాయనిక ఎరువులకు..

ఈ విపత్కర పరిస్థితుల్లో రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా సహజమైన పచ్చిరొట్ట ఎరువుల సాగు వైపు రైతులు దృష్టి సారించాల్కిసన అవసరం ఉంది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో సుమారు 56వేలకు పైగా ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలను 50శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిద రైతు వేదికల ద్వారా 120క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను పంపిణీ చేయడానికి సిద్ధం చేసింది. 30కిలోల జీలుగ విత్తనాల సంచి ధర 50శాతం సబ్సిడీతో రూ.2452.50, 40కిలోల జనుము విత్తనాలకు రూ.3110రైతులు చెల్లించాల్సి ఉంటుంది.

- ప్రయోజనాలు మెండు..

పచ్చిరొట్ట ఎరువుల సాగుతో ప్రయోజనాలు మెం డుగా ఉన్నాయి. జీలుగ, జనుము, అలసంద వంటి పంటలను సాగు చేసి భూమిలోనే కలియదున్నడం వల్ల నేలలో సేంద్రియ కర్ణనం శాతం అద్భుతంగా పెరుగుతుంది. నేల గుల్లబారి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. భూమికి అత్యంత కీలకమై న నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు సూక్ష్మ పోషకాలు సహజసిద్ధంగా లభిస్తాయి. దీనివల్ల రసా యనిక ఎరువుల వాడకం తగ్గి రైతులకు పెట్టుబడి ఖర్చులు భారీగా ఆదా అవుతాయి.

ఎరువులకు పచ్చిరొట్ట పరిష్కారం..

- నాగరాజు, ఏవో, బెజ్జూరు

గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంఖ్య గణనీ యంగా తగ్గిపోవడంతో పేడ, గొర్రెల ఎరువుల ధరలు ఆకాశన్నంటాయి. ఇది రైతులకు అదనపు భారంగా మారింది. ఇలాంటి తరుణంలో పచ్చిరొట్ట సాగు ఒక్కటే సరైన మార్గం. దీనివల్ల చీడపీడల ఉధృతి తగ్గడమే కాకుండా, నాణ్యమైన, ఆరోగ్యకరమైన దిగు బడులు వస్తాయి. రైతులు తప్పనిసరిగా పచ్చి రొట్ట సాగు చేసి భూసారాన్ని కాపాడుకోవాలి.

Updated Date - May 29 , 2026 | 10:38 PM