కార్యదర్శుల కహానీ..
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:20 PM
గ్రామ పంచాయతీల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడి కార్యదర్శులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. గ్రామాల్లో ప్ర తీ పనికి ఓ రేటు నిర్ణయించి ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామ పంచాయతీల్లో ప్రతి పనికి పైసలే...
ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు..
కొరవడిన పర్యవేక్షణ...
బెల్లంపల్లి, నవంబరు10 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడి కార్యదర్శులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. గ్రామాల్లో ప్ర తీ పనికి ఓ రేటు నిర్ణయించి ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కార్యదర్శులు అక్ర మ వసూళ్లు చేస్తూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే దారితప్పుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫేక్ యాప్‌లతో విధులు...
జిల్లాలోని మొత్తం 306 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కార్యదర్శులు ఉన్నారు. కార్యదర్శులు ప్రతీ రోజు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయానికి 9గంటలకు వెళ్లాల్సి ఉంటుం ది. గ్రామ పరిధిలో ప్రభుత్వం సూచించిన యాప్ ద్వారా హాజరు పడాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో పంచాయతీ పరిధిలో ఎన్ని ని వాస గృహాలు ఉన్నాయి...? రోజు ఎన్ని గృహాలు నుంచి చెత్త సేక రిస్తున్నారు...ఈ యాప్‌లో నమోదు చేయాలి. డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక నర్సరీల వద్ద అక్షాంశాలు, రేఖాం శాల ఆధారంగా ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ యా గ్రామాల్లో పలువురు కార్యదర్శులు స్మార్ట్‌ఫోన్‌లలో ఫేక్ యా ప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని హాజరును నమోదు చేస్తున్నారు. ఈ యాప్‌లకు నెలకు 300 నుంచి 500 రూపాయలు డబ్బులు చెల్లిం చి ప్లేస్టోర్‌లో ఫేక్ జీపీఎస్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని ఇష్టారీ తిన విధులు నిర్వహిస్తున్నారు.
గ్రామాల్లో ప్రతీ పనికి పైసలే...
జిల్లాలోని పలు గ్రామాల్లో కార్యదర్శులు ప్రతీ పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత ఆదా యమే లక్ష్యంగా కొందరు విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు జనన మరణ ధృవీకరణ పత్రాలతో పాటు నాన్ అవ లేబులిటి సర్టిఫికేట్‌ను సైతం కార్యదర్శులే ఇవ్వాల్సి ఉంటుంది. వీ టితో పాటు ఎంపీ పర్మిషన్, వాల్యుయేషన్ గ్రామాల్లో వ్యాపా రస్తుల నుంచి ట్రేడ్ లైసెన్స్‌లు, మ్యుటేషన్, లేఅవుట్ పర్మిషన్లు, ఇంటి నెంబర్లు వంటి అధికారాలు కార్యదర్శులకే ఉంటాయి. ఆ యా గ్రామాల్లో పలువురు ఇంటి నెంబరు ఇవ్వాలంటే ఆయా గ్రా మాన్ని బట్టి భూమి విలువ ఎంత ఉందో దానికి అనుగుణంగా నంబరు జారీ చేస్తే రూ.5000 నుంచి 20వేల వరకు అక్రమ వ సూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అ లాగే జనన, మరణ ధృవీకరణ (5వ పేజీ తరువాయి)
పత్రాల విషయంలో సైతం ఒక్కో సర్టిఫికేట్‌కు 2వేల నుంచి 5వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.. కార్యదర్శులకు ధృవీక రణ పత్రాల విషయంలో డబ్బులు ఇవ్వకపోతే కార్యాలయాల చుట్టు కాళ్లు అరిగేలా తిప్పించుకుం టున్నారు. గ్రామాల్లో వ్యాపారాలు నిర్వహించే వారి వద్ద ట్రేడ్ లైసెన్స్‌ల జారీ విషయంలో సైతం అక్రమాలకు పా ల్పడుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో లే అవుట్ పర్మిషన్ల కో సం లక్షల రూపాయలు వసూలు చే స్తున్నారు.
నిధుల్లో సైతం అక్రమాలు...
గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులను పారదర్శకంగా వినియోగించాల్సి ఉంటుంది. గ్రామాల్లో పా రిశుధ్యం, వీధి దీపాలు, తాటునీటి సరఫరా, రోడ్లు, మురుగు కాల్వల నిర్వహణ, మరమ్మతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా రూ. కోట్ల నిధులను విడుదల చేస్తుంది. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. లక్షల్లో నిధులు మంజూరు అవుతాయి. ఆయా గ్రామాల్లో కార్యదర్శు లు, చెత్త సేకరణ పారిశుధ్య నిర్వహణకు వాడుతున్న ట్రాక్టర్లకు ప్ర తీ నెల సుమారు రూ.10వేల వరకు డీజిల్ ఖర్చు వస్తే 15వేల నుం చి రూ.20వేల వరకు డీజిల్ పోయిస్తున్నట్లు బిల్లులు తీసుకుంటున్నా రు. ట్రాక్టర్లకు మరమ్మతులు, బోరు మోటార్లు, విద్యుత్ దీపాలు ఇత రత్ర ఖర్చులు ఎక్కువ బిల్లులు పొందుపరుస్తున్నారు.
ఏసీబీకి పట్టుబడుతున్న కార్యదర్శులు...
జిల్లాలోని పలువురు కార్యదర్శులు ఇంటి నెంబర్లు, ఇంటి పర్మిష న్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతరత్ర పనుల విషయంలో ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. కార్యదర్శులపై ఉన్నతాధికారుల పర్యవేక్ష ణ కరువవడంతోనే ఇష్టారాజ్యంగా విధులు నిర్వస్తూ అక్రమాలకు పా ల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యదర్శులపై ఉన్న తాధికారులైన ఎంపీవో, ఎంపీడీవో, డీఎల్‌పీవో, డీపీవోల పర్యవేక్షణ ఉండాలి. ఆయా గ్రామాల్లో పలువురు అధికారులు కార్యదర్శుల విధి నిర్వహణను పర్యవేక్షించడం లేదు. ఇటీవల జిల్లాలోని కన్నెపల్లి గ్రా మ పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇల్లు బిల్లు విషయంలో లబ్ధిదా రుల నుంచి రూ.5వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాం డెడ్‌గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు. అలాగే హాజీపూర్ మండ లం కర్ణమామిడి పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల నుంచి మొదటి బిల్లు నిధులు మంజూరు చేసేందుకు రూ.20వేల లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జన్నారం మం డలం లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంటి అనుమతి కో సం రూ.13వేలకు ఫోన్‌పే ద్వారా చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు ప ట్టుకున్నారు. బెల్లంపల్లి మండలంలోని బూదకుర్తు గ్రామంలో పంచా యతీ కార్యదర్శులు విదుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఏకంగా 16 మరణ ధృవీకరణ పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై అధికారులు ఇప్పటికీ కార్యదర్శులకు షోకాజ్ నోటీ సులు అందించారు.
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం...
జిల్లా పంచాయతీ అధికారి కిషన్...
మరణ ధృవీకరణ పత్రాల జారీపై కార్యదర్శులకు షోకాజ్ నోటీ సులు అందించాం. ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసు కుంటాం. అదే విధంగా ఎవరైన కార్యదర్శులు ఇంటి నిర్మాణాల కోసం, నెంబర్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీ సుకురావాలి. పంచాయతీ కార్యదర్శులు విధుల నిర్వహణను సక్రమంగా నిర్వహించాలి.