Share News

బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం విధ్వంసమైంది

ABN , Publish Date - Aug 04 , 2026 | 10:56 PM

గత బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనంలో రాష్ట్రాన్ని విద్వంసం చేశారని, కోలుకోలేని విధంగా ఆర్ధికంగా దెబ్బతీశారని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం విధ్వంసమైంది

-మంత్రి వివేక్‌వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : గత బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనంలో రాష్ట్రాన్ని విద్వంసం చేశారని, కోలుకోలేని విధంగా ఆర్ధికంగా దెబ్బతీశారని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి మండిపడ్డారు. మంగళవారం పట్టణంలోని బీ1 క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేసులో రూ. 50 కోట్ల నిధుల విషయంలో ఏసీబీ కోర్టుకు హాజరై ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేస్తున్నాడన్నారు. బీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున నిధులు ఎలా వచ్చాయో తెలపాలన్నారు. వేల కోట్ల బాండ్‌లు ఉన్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనను చూసి తట్టుకోలేక తమ ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేస్తున్నారన్నారు. తాడిచెర్ల 2 బ్లాక్‌, మణుగూరు డీప్‌సైడ్‌ బ్లాక్‌సింగరేణికి రావడం గొప్ప విషయమని, మరిన్ని గనులు తీసుకువస్తామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గం లోని ప్రజలు గత పాలకుల పనితీరును, తన పనితీరును అంచనా వే యాలన్నారు. మందమర్రి మున్సిపల్‌ ఎన్నికల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

ఫపట్టణంలోని బీ1 క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌, రెవెన్యూ, విద్యుత్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. పనుల పురోగతి గురిం చి అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశిం చారు. విద్యుత్‌ అధికారులు విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూస్తామన్నారు. అధికారులు పాల్గొన్నారు.

విదేశాలలో ఉపాధికల్పనే ధ్యేయం

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల నిర్మూలన విదేశాల్లో ఉపాధి కల్పనే ఏకైక లక్ష్యంగా ముఖ్య మంత్రి చొరవతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన గ నులశాఖ మంత్రి డాక్టర్‌జి. వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. మంగళ వా రం పట్టణంలోని సింగరేణి స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో ఉపాధిశిక్షణ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్‌లో ఉచిత శిక్ష ణ పొందుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. శిక్షణ గురించి వివరా లు అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మందమర్రిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభించి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుందని తెలిపారు. ఇక్కడ నిరుద్యోగ యువతి యువ కులకు వృత్తి ఉపాధి శిక్షణ కోర్సులను కొనసాగుతున్నాయని తెలిపారు. దాదాపు 75 మందికి పైగా ఈ శిక్షణ పూర్తి చేసు కొని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో జీఎం రాధాక్రిష్ణ, విద్యార్థులు, బోధకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 10:56 PM