వ్యవసాయానికి ‘ఆత్మ’...
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:53 PM
రైతులకు సాం కేతిక పరిజ్ఞానంతో పాటు పంటల సాగు మెళకువలు, అను బంధ రంగాల్లో అవగాహన కలిగించే వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-జిల్లాకు రూ. 16.30 లక్షలు విడుదల
-పదేళ్ల తరువాత ఎట్టకేలకు నిధులు
-పున:ప్రారంభం కానున్న కార్యక్రమాలు
-రైతులకు అందనున్న సాంకేతిక పరిజ్ఞానం
-ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం
మంచిర్యాల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రైతులకు సాం కేతిక పరిజ్ఞానంతో పాటు పంటల సాగు మెళకువలు, అను బంధ రంగాల్లో అవగాహన కలిగించే వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భా గంగా ఇటీవల నిధులు కూడా విడుదల చేసింది. నిధులు లేక, కార్యక్రమాలు కుంటుపడి పదేళ్లుగా నిస్తేజంగా ఉన్న ’ఆత్మ’కు నిధుల విడుదలతో పునరుజ్జీవం వచ్చినట్లయింది. ఇకపై రైతు శిక్షణా కార్యక్రమాలు, కిసాన్ మేళాలు, విజ్ఞాన యాత్రలు, క్షేత్ర పర్యటనలు కొనసాగించే అవకాశం కలగ నుంది. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, ఆధునిక పద్ధతులు, సాంకేతిక సహాయం రైతులకు చేరువగా తీసు కువెళ్లేలా ప్రణాళికలను రూపకల్పనచేసి వాటి అమలుకు ఈ నిధులను వెచ్చిస్తారు. శిక్షణా తరగతులతోపాటు క్షేత్ర సందర్శన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు రైతులకు సాంకే తిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా వారిని చైతన్యవం తులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ పథకాన్ని 2014 లో ప్రవేశపెట్టింది. పథకం నిర్వహణ కోసం అప్పట్లో అవ సరమైన కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాల విభ జన తర్వాత ప్రభుత్వం ఆత్మ పథకానికి నిధులు నిలిపివే యడంతో దానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ ఆగిపో యాయి. దీంతో పథకం లక్ష్యం నీరుగారింది.
పథకం కార్యకలాపాలు...
ఆత్మ పథకంలో భాగంగా బ్లాక్, జిల్లా స్థాయిలో రైతు ల కు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యవసాయ వి జ్ఞాన యాత్రలకు రైతులను పంపడం, పంట క్షేత్రాలను రై తులతో పరిశీలింపజేయడం, కిసాన్ గోష్టి నిర్వహించడం, వ్యవసాయ పరిశోధనా కేంధ్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఆధునిక పద్ధతులు రైతులకు తెలియజేస్తారు. వ్యవ సాయ, ఉద్యాన, మత్స్య, పశు సంవర్ధక, పట్టు పరిశ్రమలు, మార్కెటింగ్ శాఖల భాగస్వామ్యంతో రైతులకు శిక్షణ ఇస్తా రు. పొలం బడులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు నిర్వ హించే వ్యవసాయ అనుబంధ రంగాల కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వ్య వసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో ఆధునిక సాంకేతి కతను రైతులకు అందిస్తారు. అవసరానికి అనుగుణంగా కొ త్త విధానాలను విస్తరించడం, క్షేత్ర దినోత్సవాలను నిర్వ హించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. పథకం నిర్వ హణకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి, కార్యకలాపా లను పునరుద్ధరించనున్నారు. ఇందులో భాగంగా నిర్వహణ కమిటీ ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై ప్రగతి నివేదికలను సమీక్షిస్తుంది. కార్యక్రమాల అమలుకు అవసర మైన బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. బ్లాక్ స్థాయిలో ఆత్మ కింద ఫార్మర్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వయిజరీ సెంటర్ ఏర్పాటు కానుండగా, జిల్లాలోని వ్యవసాయ డివిజన్‌లలో ఆ శాఖ సహాయ సంచాలకులు కన్వీనర్‌గా వ్యవరిస్తారు. ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఫార్మర్ అడ్వయిజరీ క మిటీ (ఎఫ్‌ఏసీ)ల్లో 11 నుంచి 15 మంది మహిళలు, రైతు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఎఫ్‌ఏసీ నెలకోసారి స మావేశం ఏర్పాటు చేసి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటుంది.
జిల్లాకు రూ. 16.30 లక్షలు విడుదల....
ఆత్మ పథకం కింద జిల్లాకు రూ. 16.30 లక్షలు విడుద లయ్యాయి. ప్రస్తుతం విడుదలైన నిధులతో కార్యకలాపా లు చేపట్టనుండగా, భవిష్యత్తులో మరిన్ని నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారుల నుంచి ప్రతిపాదనలను కోరింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని రై తులకు చేరవేయడానికి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ కమిషనర్ నోడ ల్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా, ఇతర అనుబంధ శా ఖల అధికారులు, రైతులు, మహిళా ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరి ని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. జిల్లా అధికారుల ప్రతిపా దనల మేరకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తుంది.
మూడు లక్షల ఎకరాల్లో సాగు...
జిల్లాలో మూడు లక్షల పై చిలుకు ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మి ర్చితోపాటు పండ్లతోటలు, కూరగాయల తోటలు సాగవుతున్నాయి. ప్రధా నంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పండుతున్నాయి. ఈ పంటల సాగు లో ఇటీవల అనేక మెరుగైన పద్ధతులు వచ్చినా ఆత్మ పథకం అమలు కాక పోవడం వల్ల వాటి గురించి అవగాహన లేక రైతులు పాతపద్ధతులనే అ నుసరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ’ఆత్మ’కు చేయూ తనిస్తుండటంతో వ్యవ సాయ రంగంలో ఆధునిక పద్దతులను అవలంభించే అవకాశం రైతులకు కలుగ నుండగా, ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.