గొంతు తడపని గోదావరి జలాలు..
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:32 PM
దశాబ్దాల కా లంగా గోదావరి మంచినీటి కోసం కళ్లు కాయలు కాచేలా బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఎదురు చూస్తునే ఉన్నారు... ప్రతి ఏడాది కాలంతో సంబంధం లేకుండా పట్టణ ప్రజ లు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుస్థితి నెల కొంటోంది.
పట్టణ ప్రజలకు తప్పని ఎదురు చూపులు
-నత్తనడకన ఎల్లంపల్లి - బెల్లంపల్లి పైపులైన్ నిర్మాణ పనులు
-మున్సిపాలిటీలో నీటి కష్టాలు
బెల్లంపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : దశాబ్దాల కా లంగా గోదావరి మంచినీటి కోసం కళ్లు కాయలు కాచేలా బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఎదురు చూస్తునే ఉన్నారు... ప్రతి ఏడాది కాలంతో సంబంధం లేకుండా పట్టణ ప్రజ లు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుస్థితి నెల కొంటోంది. ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి గోదావరి నీ రందించేందుకు కొన్ని నెలల క్రితం పనులు ప్రారంభించి నప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పట్టణ ప్ర జలు గోదావరి జలాల కోసం ఈ వేసవి కాలంలో సైతం తాగునీటి కష్టాలు ఎదురు కానున్నాయి.
దశాబ్దాలుగా ఎదురు చూపులు
బెల్లంపల్లి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం 2011 సంవత్సరంలో గోదావరి నీటి పథకాన్ని ప్రతిపాదిం చారు. ఇందుకు అప్పటి ప్రభుత్వం రూ. 18 కోట్ల నిధుల తో ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి గోదావరి తాగునీటి ప థకాన్ని చేపట్టింది. ఇందుకు సంబంధించి మెగా కన్‌స్ట్రక్ష న్ లిమిటెడ్ కంపెనీ టెండరు దక్కించుకుంది. గోదావరి నీటి కోసం పట్టణంలోని రైల్వేస్టేషన్ ముందు ఓవర్ హెడ్ ట్యాంకు, ఫిల్టర్‌బెడ్ నిర్మించారు. 2014లో పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో ఎల్లంపల్లి నుంచి మందమర్రి మధ్య చాలా చోట్ల పైపు లైన్ లీకేజీలు ఏర్పడ్డాయి. అనంతరం కొన్ని సార్లు మర మ్మతులు చేసినప్పటికీ పూర్తిస్ధాయిలో విజయవంతం కా కపోవడంతో ఫిల్టర్ బెడ్‌కు పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగలేదు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్ ముందు నిర్మించిన ఫిల్టర్‌బెడ్, పంపు హౌజ్‌లో వర్షాకాలంలో మునిగిపోతు న్నాయి. దీంతో రూ. 18 కోట్ల ప్రజా ధనాన్ని నీళ్లపాలు చే సినట్లు అయ్యింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏ ర్పడిన తర్వాత గోదావరి నీటి పథకాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకు వచ్చింది. మున్సిపాలిటీలో రూ. 31 కోట్లతో మిషన్ భగీ రథ పనులను మూడేళ్ల క్రితం పూర్తి చేశారు. నీటి కోసం మూడు వాటర్ హెడ్ ట్యాంకులతో పాటు అంతర్గత పైపులైన్‌లు ఏర్పాటు చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్టు ద్వారా బెల్లంపల్లి పట్టణ ప్రజల కు మంచినీరును అందిస్తున్నారు. అడ ప్రాజెక్టు నుంచి ప్రతి రోజు నీటి సరఫరా కాకపోవడం లేదు. నాలుగైదు రోజులకు ఒకసారి నీరు వస్తుండడంతో ప్రజలు నీటి కో సం ఇబ్బందులు పడుతున్నారు.
రూ. 62 కోట్ల వ్యయంతో నత్తనడకన పైపులైన్ నిర్మాణ పనులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమృత్ 2.0 ప థకం కింద ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లి పట్టణ ప్రజల కు గోదావరి నీటిని అందించేందుకు రూ. 62 కోట్ల నిధు లు మంజూరయ్యాయి. ఆరు నెలల క్రితం అమృత్ 2.0 తాగునీటి సరఫరా అభివృద్ధి పనులను మంత్రి అనసూ య(సీతక్క) ప్రారంభించారు. ఈ నిధులతో ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లి వరకు మంచినీటి పైపులైన్‌లతో పా టు ఐదు లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన ట్యాంకు ని ర్మాణం చేపట్టి పట్టణ వాసులకు గోదావరి నీటిని అందిం చాలి. పనులు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా పైపులైన్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం, నత్తనడకన సాగుతుండడంతో గోదావరి జలాలు మరిం త ఆలస్యం కానున్నాయి. అంతేకాకుండా మండలంలోని కన్నాల జాతీయ రహదారి పక్కన అమృత్ 2.0 పథకం కింద ఐదు లక్షల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఇటు పైపులైన్ పనులతో పాటు అ టు వాటర్ ట్యాంకు సైతం పూర్తి కాకపోవడంతో గోదావ రి జలాలు బెల్లంపల్లి పట్టణ ప్రజలకు ఈ వేసవిలో కూ డా అందేలా లేవు. దీంతో రానున్న వేసవిలో మున్సిపా లిటీలో నీటి ఎద్దడి నెలకొననుంది. ఇప్పటికైనా గోదావ రిని నీటిని బెల్లంపల్లి పట్టణ ప్రజలకు అందించాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయా లని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
గోదావరి నీటిని అందించాలి
ప్రకాష్, బెల్లంపల్లి
మా వార్డులో మూడు, నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు వస్తుంది. అరకొరగా తాగునీటిని అందించడం తో ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడో ఉన్న అడ ప్రాజె క్టు ద్వారా వచ్చే నీరు మంచిగా ఉండడం లేదు. దీంతో నీటిని కొనుగోలు చేసి తాగుతున్నాం. గోదావరి నీరు వచ్చే విధంగా చూడాలి.
పనులు త్వరగా పూర్తి చేయాలి
వెంకటేష్, బెల్ల్లంపల్లి
అమృత్ 2.0 కింద చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలి. మా వార్డులో మూడు రోజులకు ఒకసా రి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీటి అవసరాలకు మినరల్ వాటర్ కొనుగోలు చేయాల్సి వ స్తుంది. అప్పుడప్పుడు మంచినీరు కలుషితమై వస్తుంది. మంచినీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియకపోవడంతో పం పుల వద్ద వేచి చూడాల్సి వస్తుంది. ఎన్నో ఏండ్లుగా గో దావరి నీటిని అందిస్తామని నాయకులు హామీలు ఇస్తు న్నప్పటికి నేటికి నెరవేర్చలేదు. పట్టణ ప్రజలందరికి గోదావరి నీరు అందించాలి.