Share News

kumaram bheem asifabad-‘సర్‌’ అయోమయం

ABN , Publish Date - Sep 04 , 2026 | 10:56 PM

చేయని తప్పుకు అధికారులు ఓటర్లను అధికారులు ముప్పు తిప్పలు పెడుతూ నోటీసులు జారీ చేయడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అయోమయానికి దారి తీస్తోంది. ఓటర్ల నుంచి పూర్తి వివరాలు సేకరించి, మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టినప్పటికీ తాజాగా నోటీసులు జారీ చేస్తుండడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది

kumaram bheem asifabad-‘సర్‌’ అయోమయం
కాగజ్‌నగర్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ హియరింగ్‌లో పాల్గొన్న అధికారులు(ఫైల్‌)

అధికారుల తీరుపై దరఖాస్తుదారుల ఆగ్రహం

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): చేయని తప్పుకు అధికారులు ఓటర్లను అధికారులు ముప్పు తిప్పలు పెడుతూ నోటీసులు జారీ చేయడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అయోమయానికి దారి తీస్తోంది. ఓటర్ల నుంచి పూర్తి వివరాలు సేకరించి, మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టినప్పటికీ తాజాగా నోటీసులు జారీ చేస్తుండడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాలు ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ నోటీసులు ఎందుకు జారీ చేస్తున్నారని సంబంధిత బీఎల్‌ఓలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా 2002 నాటి ఓటరు జాబితాలో వివరాలను ప్రస్తుత ఓటర్ల సమాచారం అనుసంధా నం చేసే క్రమంలో జిల్లాలో 20,929 మంది ఓటర్ల సమాచారంతో అనుసంధానం చేసే క్రమంలో జిల్లాలో మ్యాపింగ్‌కు దూరంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓటరు పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు లేదా చిరునామాలో చిన్నపాటి తప్పులు, ఒక్క అక్షర దోషమున్నా అధికారుల ముందు విచారణకు నిర్ణీత తేదీన హాజరు కావాలనడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- నిర్ణీత గడువులోగా..

వీరందరికి నిర్ణీత గడువులోగా నోటీసులు అందజేసి అవసరమైన ఆధారాలతో హియరింగ్‌కు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాం గం ఆదేశించింది. జిల్లాలో మరి కొంత మంది ఓటర్లు, ఇంటిపేరు, వయస్సు వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించారు. వీరిని అనామలీస్‌ కేటగిరిలో పరిగణించి నోటీసులు చేయడం విశేషం. కాగజ్‌నగర్‌కు చెందిన తుఫైల్‌ పూర్తి వివరాలతో ఎస్‌ఐఆర్‌ ఫారాలతో నింపి సంబంధిత బీఎల్‌ఓతో మ్యాపింగ్‌ చేసి ఇప్పటికీ పక్షం రోజులు దాటింది. కానీ ఇంత వరకు ఆన్‌లైన్‌లో కన్పించక పోవడతో అనుమానం వచ్చిన అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లింది. తప్పు ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ కాక పోతే నోటీసులు రావాలి, ఇక్కడ నోటీసులు రాలేదు, ఆన్‌లైన్‌లో కన్పించడం లేదు. అలాగే ఓటర్లు పూర్తి వివరాలు అందజేసినా కూడా నోటీసులు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓటరు తన వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు అందించిన తర్వాత దానిని సక్రమంగా నమోదు చేయగం, పరిశీలించడం, సంబంధిత వివరాలతో మ్యాపింగ్‌ చేయడం అధికార యంత్రాంగం బాధ్యత. కానీ మ్యాపింగ్‌లో సాంకేతిక లోపాలు, పేర్లలో స్వల్ప తేడాలు లేదా డేటా నమోదులో పొరపాట్లు జరిగితే వాటి భారం సాధారణ ఓటర్లపై పడకూడదని దరఖాస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసు అందుకున్నంత మాత్రాన ఓటు వెంటనే తొలగిపోదని, సంబంధిత పత్రాలతో హియరింగ్‌కు హాజరై వివరాలు నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతా ల్లో, పట్టణ ప్రాంతాల్లో చాలా మందికి ఓటర్లకు నోటీసులు ఎందుకు వచ్చిందో పూర్తిగా అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సూదర ప్రాంతాల నుంచి వస్తుండడంతో సమయంతో పాటు వ్యయప్రయాసాలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. కాగజ్‌నగర్‌కు చెందిన పలువురు ప్రముఖలకు సైతం నోటీసులు రావడం చర్చనీయాంశమవుతోంది.

Updated Date - Sep 04 , 2026 | 10:56 PM