‘ఉజ్జిని’ నారాయణరావు సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:24 AM
: దివంగత మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు అన్ని వర్గాల ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
చింతపల్లి, జూలై 13(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు అన్ని వర్గాల ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. ఉజ్జిని నారాయణరావు 10వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారకార్థం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలకేంద్రంలో నిర్మించిన సీపీఐ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో కూనంనేని మాట్లాడారు. నిజాం రాచరిక వ్యవస్థకు స్తంభాలుగా ఉన్న జాగీరుదారి, పెత్తందారు, భూస్వామ్య, దొరల దౌర్జన్యాలను ఎదురించేందుకు ఉజ్జిని ముందుకొచ్చి కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో ఉద్యమాలు చేపట్టారని గుర్తుచేశారు. దేవరకొండలో కొంతమంది భూకబ్జాదారులు భూములను అక్రమించుకోనే దశలో, అటవీ భూములను, సీలింగ్ భూములను ప్రత్యేక్షంగా 10 వేల ఎకరాల భూములను పంపిణీ చేశారన్నారు. నియోజకవర్గంలో ఎస్‌ఎల్‌బీసీ, డిండి, ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం కృష్ణాజలాలు ఈ ప్రాంతానికి అందించేందుకు నారాయణరావు కృషి చేశారన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ గ్రామీణ భారత నిర్మాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతవ్యక్తి ఉజ్జిని అని అభివర్ణించారు. రైతాంగ స మస్యల కోసం ముందుండి వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాడారన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. రైతాంగ సాయుధ పోరాటంలో నారాయణరావు ప్రముఖ పాత్ర వహి ంచి సమస్యల సాధన కోసం పని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, కుందిమళ్ల ప్రతా్‌పరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివా్‌సరావు, సహాయ కార్యదర్శి నరసింహ, నాయకులు బొమ్మగాని ప్రభాకర్, ఆందోజు రవీంద్రచారి, ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, తూమ్ బుచ్చిరెడ్డి, శ్రీనివాస్, పల్లె నరసింహ, యుగంధర్‌రావు పాల్గొన్నారు.