kumaram bheem asifabad- కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Sep 27 , 2026 | 10:24 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కొండాలక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు
ఆసిఫాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):అచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కొండాలక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ చేసిన పోరాటం, ప్రజా సేవకు అంకితమైన అయన జీవితం చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో అయన కీలకపాత్ర పోషించారని ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడన్నారు. బాపూజీ అశయాలు సేవా స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.అలాగే పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి భవన్‌లో బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ, జిల్లా బీసీ సంక్షేమాదికారి నదీం, సీపీవో గురువయ్య, డీఏవో వెంకటి, పద్మశాలి సేవా సంఘం నాయకులు అంజనేయులు, మల్లయ్య,మోహన్, చిప్ప చిట్టిబాబు, శ్రీకాంత్, శంకర్, శైలేందర్, బీసీ సంఘం నాయకులు రూప్‌నార్ రమేశ్ పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సభ్యులు శ్రీనివాస్,గణేష్, రమేష్, ఓంప్రకాష్, విలాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక జేత్వాన్ బుధ్ధవిహార్‌లో లక్ష్మణ్ సేవాసదన్ ఆధ్వర్యంలో, పద్మశాలి భవన్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా జయంతి వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్బంగా కొండా లక్ష్మణ్ బాపుజీ చిత్రపటాలకు ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో లక్ష్మణ్‌సేవాసదన్ చైర్మన్ గాదే అవినాష్, సర్పంచ్ సతీష్, ఉపసర్పంచ్ దీపక్‌ముండె, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు విజయ్, దుర్గం ప్రశాంత్, రోషన్, రమేశ్, విఠల్, రాజేశ్వర్, దుర్గం శ్యాంరావు, పద్మశాలి సంఘం నాయకులు ఒడ్డెపల్లి సతీష్, బండు, జంజిరాల రవి, ఇరుకుళ్ల నరేష్, అఖిల్, మొండయ్య, ఎంగలి రాకేష్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): గోలేటి పద్మశాలి వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గౌరవ అధ్యక్షులు కన్నం రాజమల్లు, కన్నం రాజమల్లు, అధ్యక్షులు గుండెటి వీరస్వామి పద్మశాలి సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం అంతా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.