లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:42 PM
అర్హులందరికీ పెన్షన్లు అందించడం జరుగుతుందని డీఆర్‌డీవో చిన్నఓబులేషు అన్నారు.
వెల్దండ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ పెన్షన్లు అందించడం జరుగుతుందని డీఆర్‌డీవో చిన్నఓబులేషు అన్నారు. సోమవారం మండలంలోని వెల్దండ, చెర్కూర్, బర్కత్‌పల్లి, పెద్దాపూర్, బొల్లంపల్లి, శంకరకొండతాండా, చౌదర్‌పల్లి, గుండాల, పోతేపల్లి, పోచమ్మగడ్డతాండా, మర్రిగుంతతాండా, లింగారెడ్డిపల్లి, భైరాపూర్, అజిలాపూర్, కుందారంతండాలలో చిన్నఓబులేషు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పెన్షన్ దరఖాస్తుదారులతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు, వాహనాలు ఉన్నాయా లేవా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. సమగ్రంగా విచారణ జరిపిన అనంతరం పెన్షన్‌కు ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈసీ దేవేందర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు ఉన్నారు.