Share News

మంచిర్యాల మేయర్‌ పీఠం బీజేపీదే

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:50 PM

మంచిర్యాల మున్సి పల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమ ని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి పేర్కొన్నారు.

మంచిర్యాల మేయర్‌ పీఠం బీజేపీదే

బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల మున్సి పల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమ ని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, దీన్ని ప్రజలందరు గమనించాలన్నారు. ప్రజలందరు బీజేపీ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:51 PM