Share News

దంచికొడుతున్న ఎండలు...

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:04 PM

జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్య ప్రతాపం రోజు రోజుకూ అధికమవుతుండ టంతో ఎండ వేడిమికి ప్రజలు బెంబేలెత్తుతు న్నారు. గత నాలుగైదు రోజులుగా తీవ్రతమర మవుతున్న ఎండలతో ప్రజలు సతమతమవు తున్నారు.

దంచికొడుతున్న ఎండలు...

రోజు రోజుకూ పెరుగుతున్న ఊష్ణోగ్రతలు

ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రజలు

జిల్లాలో 42.8 డిగ్రీలు నమోదు

మంచిర్యాల, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్య ప్రతాపం రోజు రోజుకూ అధికమవుతుండ టంతో ఎండ వేడిమికి ప్రజలు బెంబేలెత్తుతు న్నారు. గత నాలుగైదు రోజులుగా తీవ్రతమర మవుతున్న ఎండలతో ప్రజలు సతమతమవు తున్నారు. ముఖ్యంగా పగటి పూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బ యటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదవుతుండటంతో వాతావర ణశాఖ ఆరెంజ్‌ హెచ్చరికలతో ప్రజలను అప్ర మత్తం చేస్తోంది. ఉదయం 10 గంటలకే భా నుడు ప్రతాపం చూపుతుండటం, విపరీత మైన ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు, రహదారులు వేడెక్కుతుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.

తీవ్రతరమవుతున్న ఉష్ణోగ్రతలు.....

ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతుండటం, ప గటి వేళలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు న మోదవుతుండగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న ప్రజలు నీడ ప్రాంతాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని శ్రీరాంపూర్‌, మం దమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లో అం డర్‌ గ్రౌండ్‌ బొగ్గు బావులతో పాటు ఓపెన్‌ కాస్టు మైన్‌లు అధిక సంఖ్యలో ఉండడంతో ఇ క్కడి వాతావరణం తీవ్రంగా వేడుక్కుతోంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బయటకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. సింగరేణి కార్మికులు మొదటి షిఫ్ట్‌లో ఇంటికి వచ్చే సమయంలో, రెండో షిఫ్ట్‌లో వి ధులకు వెళ్లేటప్పుడు తీవ్ర ఎండ వేడిమికి గురవుతున్నారు. మార్కెట్లో కూరగాయల వి క్రేతలు, ఇతర చిరువ్యాపారులు ఎండకు తాళ లేకపోతున్నారు. ఛత్రీలు ఏర్పాటు చేసుకుం టున్నప్పటికీ విపరీతమైన దాహంతో తహత హలాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణం గా ప్రజలు శీతలపానీయాల దుకాణాలను ఆ శ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారు.

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి......

జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగ డంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్క పోతకు గురవుతుండగా సామాన్య జనం ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహ నాలపై బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జం కాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. పగటి పూ ట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవు తుండడంతో ఇండ్లలోనూ ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఏసీలు ఉపయోగిస్తే కా ని ఇండ్లలో ఉండే పరిస్ధితి లేదు. కూలర్‌ల లో నూ వేడి గాలులు వస్తుండడంతో ప్రజలు ఉ క్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 11 గంట లకే ముఖ్యమైన రహదారులపై జనసంచారం తగ్గుముఖం పడుతుండటం ఎండ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.

జిల్లాలో ఉష్ణోగ్రత ఇలా....

జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో నమో దై న ఉష్ణోగతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 11న కన్నెపల్లి మండలం జన్కాపూర్‌, జైపూర్‌ మండలం కుందారంలో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12వ తే దీన పలు మండలాల్లో 41.6 డిగ్రీలు నమో దుకాగా, 13న 41.8 డిగ్రీలు నమోదుకాగా, తా జాగా మంగళవారం 42.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత లు చేరుకున్నాయి. జైపూర్‌ మండలం కుం దారంలో గరిష్టంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, కాసిపేట మండలం కొండా పూర్‌లో 42.6 డిగ్రీలు, మందమర్రి మండలం అందుగులపేటలో 42.5 డిగ్రీలు, కోటపల్లి మండలం దేవులవాడలో 42.5 డిగ్రీలు, భీమా రం మండలంలో 42.5 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కేంధ్రంలో 42.4 డిగ్రీలు, నస్పూర్‌లో 42.4 డిగ్రీలు, జన్నారం మండలంలో 42.1 డి గ్రీలు, నెన్నెల మండలంలో 42.1 డిగ్రీలు, భీమి ని మండలంలో 42.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్ర తలు నమోదుకాగా, వాతావరణశాఖ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

Updated Date - Apr 14 , 2026 | 11:05 PM