ఆలయ పవిత్రత, ప్రతిష్ఠను కాపాడాలి
ABN , Publish Date - May 12 , 2026 | 12:14 AM
ఆలయ పవిత్రత, ప్రతిష్ఠను కాపాడేలా పాలకమండలి సభ్యులు పనిచేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
నార్కట్‌పల్లి, మే 11(ఆంధ్రజ్యోతి): ఆలయ పవిత్రత, ప్రతిష్ఠను కాపాడేలా పాలకమండలి సభ్యులు పనిచేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం జరిగిన నూతన ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారంలో మాట్లాడారు. భగవంతునికి, భక్తులకు సేవ చేసే భాగ్యం కొందరికే దక్కుతుందని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం, దేవస్థాన అభివృద్ధికి ప్రణాళికలు రచించి ఎండోమెంట్ అధికారుల ద్వారా పాటుపడాలని సూచించారు. దక్షిణకాశిగా పేరుగడిస్తూ ఎంతో మహిహాన్వితమైన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఆలయ పాలకమండలి సభ్యులుగా వారాల రమేశ్, కొమ్ము శ్రీను, మదుల నర్సింహ, రంగ శ్రవణ్‌కుమార్, నల్ల అనిత, పాల మహేశ్, వీరవెళ్లి రఘునాథ్, మర్రి లింగస్వామి, గద్దగూటి యాదయ్య, రేగట్టె శ్రీనివా్‌సరెడ్డి, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, ఇడుకుళ్ల సంపత్‌కుమార్, కమ్మాలపల్లి మల్లేశ్, గౌరేదీవి లక్ష్మయ్య, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్‌గా చెర్వుగట్టుకు చెందిన వారాల రమేశ్‌ను నకిరేకల్‌కు చెందిన ధర్మకర్త వీరవెళ్లి రఘునాథ్ ప్రతిపాదించగా రంగ శ్రవణ్‌కుమార్ బలపర్చారు. కార్యక్రమంలో సర్పంచులు నేతకాని కృష్ణయ్య, యెల్లెందుల లింగస్వామి, జెరిపోతుల భరత్, ఉప్పుల వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్య, నల్ల వెంకన్న, రేగట్టె రాజశేఖర్‌రెడ్డి, పున్నంరాజు యాదగిరి, పాశం శ్రీనివా్‌సరెడ్డి ఉన్నారు.