అదే జోరు.. వాన హోరు
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:56 AM
జిల్లాలో మంగళ వారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం గురువారం కూడా తన ప్రతాపాన్ని చూపింది.
-జిల్లాలో గరిష్టంగా 156.8 మి.మీ వర్షపాతం నమోదు
-వాగులు, వంకలు ఉప్పొంగడంతో రాకపోకలు బంద్
-సింగరేణి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
-ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి
మంచిర్యాల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ వారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం గురువారం కూడా తన ప్రతాపాన్ని చూపింది. రెం డు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షం కారణం గా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రజల రవాణాకు తీవ్ర ఆ టంకం ఏర్పడుతోంది. గురువారం ఉదయం నుంచి సా యంత్రం వరకు జిల్లాలో 76.9 మిల్లీమీటర్ల సగటు వర్షపా తం నమోదైంది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని వీధులు వరద నీటి ప్రవాహంతో చెరువులను తలపించాయి.
జిల్లాలో నమోదైన వర్షపాతం....
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 76.9 మి ల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జన్నారం మండ లం తపాల్‌పూర్‌లో గరిష్టంగా 156.8 మి.మీ వర్షం కురి సింది. అలాగే కాసిపేట మండలం కొండాపూర్‌లో గరిష్టంగా 153.5, హాజీపూర్ మండలంలో 113.3, మందమర్రి మండ లంలో 89.0, నస్పూర్‌లో 86.8, జైపూర్ మండలంలో 86.5, దండేపల్లి మండలం లింగాపూర్‌లో 85.0, లక్షెట్టిపేట మం డలం శాంతాపూర్‌లో 78.8, పాత మంచిర్యాలలో 78.5, నె న్నెల మండలంలో 71.3, కన్నెపల్లి మండలంలో 60.0, భీమి ని మండలంలో 56.5, తాండూరు మండలంలో 56.3, బె ల్లంపల్లి మండలంలో 52.5, కోటపల్లి మండలంలో 45.3, వేమనపల్లి మండలం నీల్వాయిలో 43.0, చెన్నూరు మండ లంలో 42.5, భీమారం మండలంలో 29.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఓసీపీల్లో కదలని యంత్రాలు...
జిల్లాలో కురుస్తున్న ఎడతెరపిలేని భారీ వర్షం కారణం గా ఓపెన్‌కాస్టు గనుల్లో పెద్ద మొత్తంలో వరద చేరి, భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని శ్రీరాం పూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓ పెన్ కాస్టు గనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ గా వర్షపు నీరు చేరడంతో గనుల్లో భారీ యంత్రాలు కదల్లే ని పరిస్థితి ఏర్పడింది. దీంతో బొగ్గు తవ్వకాలు, ఓబీ మట్టి తొలగింపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. క్వారీల్లో నీరు నిలిచిపోవడంతో పనులు జరగడం లేదు. భారీ వాహనాలు బురదలో కూరుకుపోయే అవకాశం ఉండటంతో ఒడ్డుపై ని లిపి ఉంచారు. మూడు ఏరియాల్లోని ఇందారం, రామకృ ష్ణాపూర్, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో రెండు రోజులో దాదాపు 64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలి చిపోగా, సుమారు మూడు లక్షల 60వేల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితతకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గనుల్లో నీరు నిల్వ ఉండటంతో డం పర్లు, ఎక్సకవేటర్లు వంటి బారీ యంత్రాల నిర్వ హణ కష్టం గా మారింది. ఫలితంగా బొగ్గు రవాణా కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. వర్షాలు తగ్గిన తరువాత గనుల్లో నిల్వ నీటిని తొలగించి, పరిస్థితిని సమీక్షించిన అనంతరమే పూర్తిస్థాయి లో కార్యకలాపాలు పున:రుద్దరించే అవకాశం ఉంటుంది.
ఎల్లంపల్లికి పెరుగుతున్న నీటి మట్టం.....
ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా గుడిపేట స మీపంలోగల ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.70 మీటర్ల ఎత్తు వరకు నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు గా ను గురువారం రాత్రి వరకు 19.341 టీఎంసీల నీరు చేరిం ది. ఎగువ నుంచి 3,56,254 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతుండటంతో గణనీయంగా నీటి మట్టం పెరుగుతోంది. రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టు 15 గేట్లు తెరిచి 1,55,625 క్యూసెక్కుల నీటిని దివగు గోదావరి లోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి వరద తాకిడి ఎక్కువ ఉండడంతో రాత్రి 9 గం టల వరకు మరిన్ని గేట్లు ఎత్తడం ద్వారా 4లక్షల పైచిలుకు క్యూసెక్కులను గోదావరిలోకి వదల నున్నట్లు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్రాచారి తెలిపారు. ఇదిలా ఉం డగా హైద్రాబాద్‌లోని మెట్రోపాలిటన్ వాటర్ స్కీం కోసం 275 క్యూసెక్కులు, నందిమేడారంలోని నంది పంప్ పంప్ హౌజ్‌కు 15,750 క్యూ సెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతుం డటంతో జలకళ సంత రించుకుంది.
పాఠశాలలకు సెలవు...
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమా న్యా ల కింద పని చేస్తున్న పాఠశాలలకు కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు గురువారం సెలవు ప్రకటించారు. అయితే ఉదయం 9.10 గంటలకు సెల్‌ఫోన్‌లకు మెసేజ్ ఇవ్వడంతో అప్పటికే ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిపో యారు. దీంతో అధికారుల వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పొరుగు జిల్లాలు అయిన ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉదయం 7.30 కే సమాచారం ఇవ్వడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకే పరిమితం అయ్యారు. జి ల్లాలో కూడా ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందనే అభిప్రా యాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
వరద తాకిడికి కొట్టుకుపోయిన కల్వర్టు...
పలు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్
నస్పూర్ : బంగాళఖాతంలో ఏర్పడిన ఆల్పపీడన ప్రభా వంతో గురువారం కూడా ఎడ తెరిపి లేకుండా కురుస్తుంది. వర్షం కారణంగా నస్పూర్- మం చిర్యాల మద్య గల తోళ్లవా గు వరద నీటితో ఉధ్రుతంగా ప్రవహిస్తోంది. దిగువన వినూత్న కాలనీ-కాకతీయ కాలనీల ప్రజల రాకపోకలకు వా గుపై కల్వర్టు నిర్మించారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వాగు కల్వర్టు కొట్టుకు పోయింది. దీంతో కాలనీ వాసుల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందిం చి తోళ్లవాగుపై శాశ్వతమైన వంతె నను నిర్మించాలని కాల నీల వాసులు కోరుతున్నారు. కొట్టు కుపోయిన కల్వర్టును స్థానిక కార్పొరేటర్ సుదమల్ల హరి కృష్ణ పరిశీలించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, మేయర్ మధుకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
నస్పూర్‌లోని 32వ డివిజన్‌లోని లక్ష్మి గార్డెన్ సమీపంలో ఒర్రెపై ప్రవాహానికి అడ్డుపడిన చెత్త చెదారం జేసీబీతో తొ లగించే పనులు చేయించారు. నస్పూర్‌లో వివిధ ప్రాంతా ల్లో చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లపై పడడంతో విద్యుత్ అం తరాయం ఏర్పడింది. వెంటనే సిబ్బంది చేరుకుని పడిపో యిన చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిం చామని ఏఈ రాంచందర్ తెలిపారు. నస్పూర్ పెద్ద చెరు వు కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయి నీటి మట్టం పెరగ డంతో జలకళ సంతరించుకుంది. చెరువులో నీటి మట్టం పెరగడంతో ఎక్కువైన నీరు మత్తడి ద్వారా దిగువకు ప్రవహిస్తోంది.