Share News

kumaram bheem asifabad- అమరుల త్యాగాలు చిరస్మరణీయం

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:36 PM

అడువుల సంక్షణలో అమరుల త్యాగాలు చిరస్మరణీయమని డీఎఫ్‌వో బాలామణి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురష్కరించుకొని అటవీశాఖ ఉద్యోగులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ

kumaram bheem asifabad- అమరుల త్యాగాలు చిరస్మరణీయం
ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎఫ్‌వో బాలామణి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అడువుల సంక్షణలో అమరుల త్యాగాలు చిరస్మరణీయమని డీఎఫ్‌వో బాలామణి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురష్కరించుకొని అటవీశాఖ ఉద్యోగులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీని జిల్లా అటవిశాఖ అధికారిణి బాలామణి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన వీదుల గుండా ఈ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ అడవుల సంరక్షణలో అమరులైన వారి త్యాగాలు వెలకట్టలేవన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వోలు గోవింద్‌చంద్‌ సర్థార్‌, రమదేవి, రమేష్‌, మజారోద్దిన్‌, జూనియర్‌ ఫారెస్టు అసోసియోషన్‌ అధ్యక్షులు యోగేష్‌ కులకర్ణి, సభ్యులు సద్దాం హుస్సేన్‌, సాయి, డీప్యూటీ రేంజ్‌ అధికారులు విజయ్‌, ప్రకాష్‌, ఝాన్సీరాణి, ఇక్బాల్‌, జమీల్‌, షాబాజ్‌, సెక్షన్‌, బీట్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో శుక్రవారం అటవీ శాఖ అమర వీరుల స్మారక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరులైన వారి చిత్రపటాలకు పూల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరి, ఎఫ్‌డీవో భార్గవ్‌కుమార్‌ మాట్లాడుతూ అటవీ శాఖ అమర వీరుల త్యాగాలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు రేంజ్‌ల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 11:36 PM