kumaram bheem asifabad- వీర యోదుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:26 PM
ఎంతో మంది వీరుల త్యాగాల ఫలితంగానే నేడు స్వాతంత్య్ర ఫలాలను పొందుతున్నామని, వారి త్యాగాలు చిరస్మరణీయమని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో గురువారంనిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కె హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్వో దాసరి వేణుతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు
-శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్
ఆసిఫాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎంతో మంది వీరుల త్యాగాల ఫలితంగానే నేడు స్వాతంత్య్ర ఫలాలను పొందుతున్నామని, వారి త్యాగాలు చిరస్మరణీయమని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో గురువారంనిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కె హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్వో దాసరి వేణుతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అంతకు ముందు పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటుందన్నారు. అన్ని వర్గాల ఆభివృద్దియే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజాసంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సెప్టెంబరు 17, 1948 ఒక గొప్ప రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వాతంత్ర భారతవణిలో అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుమరం భీం పోరాటాన్ని సగర్వంగా దశదిశలా చాటాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల పాలనలో మహిళల ఆర్థిక పురోభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. ఇందులో భాగంగా మహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.41 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకొని రూ. 88 కోట్లు లబ్దిపొందాన్నారు. జిల్లాలో 8,798 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని జిల్లాలో 83వేల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయన్నారు. ప్రభుత్వం రేషన్‌కార్డుల లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. రైతుసంక్షేమమే లక్ష్యంగా రైతుభరోసా కింద పెట్టుబడి సహయాన్ని అందిస్తుందన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులుతీసుకువచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రతినియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. . అంతకు ముందు జిల్లా కలెక్టర్ హరిత మండలి డిప్యూటీ చైర్మన్‌కు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కామ్డె అనిల్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ, పీఏసీఎస్ చైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు వెంకన్న, భాగ్యలక్ష్మి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.