kumaram bheem asifabad- పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:14 PM
పోలీస్ అమరవీరుల త్యాగాలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, వారి సేవలు చిరస్మరణీయమని ఎస్పీ నితికాపంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గోని .పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు, అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు.ఈ
ఆసిఫాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అమరవీరుల త్యాగాలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, వారి సేవలు చిరస్మరణీయమని ఎస్పీ నితికాపంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గోని .పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు, అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల పట్ల బాధ్యత, దేశం పట్ల నిబద్ధతతో కూడిన పవిత్రమైన కర్తవ్యమని అన్నారు.దేశ రక్షణ,శాంతిభద్రతల పరిరక్షణ,ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని, వారి సేవలను సమాజం ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు.జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో 1985 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 14మంది పోలీసులు సమాజం కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. అమరవీరుల సేవలను మరోసారి స్మరించుకోవడంతో పాటు,వారి త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ సంధర్బంగా అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు బి.అశోక్, వహిదుద్దీన్, సీఐలు, ఆర్ఐలు,ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబరు 22నుంచి జిల్లాలో ఫొటోగ్రఫీ,షార్ట్ ఫిల్మ్వీడియోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు.అలాగే విద్యార్థులకు, పోలీస్ అధికారులకు,సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.యువత, విద్యార్థులు, ఫొటోగ్రఫీ, వీడియో రంగంపై ఆసక్తి ఉన్నవారు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు.