స్వరాష్ట్ర సాధనలో వీరుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:08 PM
స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మ రణీయమని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు హర్కర వేణుగోపా ల్‌రావు పేర్కొన్నారు.
-సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి
-2047 నాటికి మరింత ఉన్నత శిఖరాలకు రాష్ట్రం
-జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేద్దాం
-రాష్ట్ర ప్రభుత్వ సలహదారు హర్కర వేణుగోపాల్‌రావు
మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మ రణీయమని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు హర్కర వేణుగోపా ల్‌రావు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అం తకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మొద టగా బైపాస్‌రోడ్డులోని అమరవీరుల స్తూపం వద్ద పె ద్దప ల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి అమరులకు నివాళులర్పిం చా రు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళు లర్పించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీ వంశీకృష్ణతో కలిసి వేడుకలకు హాజ రయ్యారు. వికలాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ముందుకు సాగుతున్నాయన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ప్రతి కుటుంబానికి వర్తింపజేసి రూ. 5 లక్షల బీమా పొందేలా ప్రభుత్వం నూతన పథకం ప్రవే శపెట్టిందన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా జిల్లాలో 3,94, 049 మంది మహిళలకు రూ. 141.80 కోట్ల లబ్ది చేకూరిం దన్నారు. జిల్లాలో 1,24,809 మంది లబ్దిదారులకు రాయితీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ , గృహ జ్యోతి, పథకాల ద్వారా రూ. 63.71 కోట్లను కేటాయిం చామన్నారు. రుణమాఫీ ద్వారా 63,779 మంది రైతులకు 537 కోట్లను మాఫీ చేశామన్నారు. 2047 నాటికి మ రింత ఉన్నత శిఖరాలకు రాష్ట్రం చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్ర మంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్‌లు రాములు, చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏవో రాజేశ్వర్, జిల్లా అధికారులు, సిబ్బంది, కళాకారులు పాల్గొన్నారు.
-ఆకర్షణగా పోలీసుల కవాతు, చిన్నారుల నృత్యాలు
బెల్లంపల్లి ఆర్‌ఐ పెద్దయ్య ఆధ్వర్యంలో చేసిన పోలీసుల కవాతు ఆకట్టుకుంది. అలాగే చిన్నారులు, కళాకా రులు చేసిన నృత్యాలు అందర్ని అలరించాయి.
మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో ఘనంగా తెలం గాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. మేయర్ ధర్ని మదూకర్ జాతీయ జెండాను ఎగురవేసి వం దనం సమర్పించారు. డిప్యూటి మేయర్ సల్ల రమ్య, కార్పొ రేటర్లు పాల్గొన్నారు.
జిల్లా కోర్టుల సముదాయంలో...
జిల్లా కోర్టుల సముదాయంలో తెలంగాణ ఆవిర్భావ వే డుకల సందర్భంగా న్యాయమూర్తి ఏ.వీరయ్య జెండాను ఆవిష్కరించారుఈ కార్యక్రమంలో ఏవో సూర్యకాంత్, న్యా యవాదులు రాజ్‌గోపాల్, కోర్టు సిబ్బంది న్యాయవాదులు పాల్గొన్నారు.
ఫఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నివాసం వద్ద డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ జెం డాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్ర మంలో మేయర్ ధర్ని మధూకర్, నగరపాలక ఽఅధ్యక్షులు తూముల నరేశ్, కార్పొరేటర్‌లు నాయకులు పాల్గొన్నారు.
ఫకమిషనర్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్‌ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. . సిబ్బందికి శుభాకాంక్షలు తెలిఆరు. ఈ కార్యక్రమంలో అడిష నల్ డీసీపీ అడ్మిన్ కె. శ్రీనివాస్, ఏసీపీలు రమేశ్, ఆర్. ప్రకాశ్, నాగేందర్‌గౌడ్, శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.