సైనికుల త్యాగం మరువలేనిది
ABN , Publish Date - Jul 26 , 2026 | 09:52 PM
కార్గిల్ యు ద్ధంలో మృతి చెందిన సైనికుల త్యాగాలు మరులేని వని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. కార్గిల్ విజ య్ దివస్ సందర్భంగా ఆదివారం పట్టణంలోని బెల్లంప ల్లి చౌరస్తా వద్ద సైనికులకు నివాళులు అర్పించారు.
-ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల క్రైం, జులై 26 (ఆంధ్రజ్యోతి) : కార్గిల్ యు ద్ధంలో మృతి చెందిన సైనికుల త్యాగాలు మరులేని వని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. కార్గిల్ విజ య్ దివస్ సందర్భంగా ఆదివారం పట్టణంలోని బెల్లంప ల్లి చౌరస్తా వద్ద సైనికులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికుల శౌర్యం, త్యా గం, దేశంపట్ల వారి అచంచలమైన నిబద్దతను కొనియా డారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధూకర్, కార్పొ రేటర్ చింతపండు శ్రీనివాస్, నాయకులు సల్ల మహేష్, రమణ పాల్గొన్నారు.
అమర జవాన్ల త్యాగాలను మర్చిపోలేం
దండేపల్లి : దేశ భద్రత కోసం ప్రాణార్పించిన అమర జ వాన్లు త్యాగాలను మర్చిపోలేమని లయన్స్ క్లబ్ జోనల్ చైర్‌పర్సన్ లయన్ మాదంశెట్టి మల్లిఖార్జున్, మండల అ ధ్యక్షుడు కోండు రామన్న పేర్కొన్నారు. మండల లయన్స్ క్ల బ్ ఆధ్వర్యంలో ఆదివారం కార్గిల్ విజయ్ దీవస్‌ను పుర స్కరించుకోని మ్యాదరిపేటకు చెందిన విశ్రాంత ఆర్మీ జ వాన్లు కుమ్మరి కిరణ్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్ర మంలో లయన్స్ క్లబ్‌మాజీ అధ్యక్షుడు అన్నం సత్యనారా యణ, కొండు జనార్థన్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి రమేష్, సభ్యులు శేఖర్, రమేష్, శ్రీనివాస్, లక్ష్మణ్ పాల్గొన్నారు.